Jr NTR: ఎన్టీఆర్ బామ్మర్దిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన హీరో నార్నె నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. రీసెంట్ గా మ్యాడ్ స్క్వేర్ తో మన ముందుకొచ్చాడు. ఈ మూవీలో నార్నె నితిన్ ( Narne Nithin ) , రామ్ నితిన్ ( Ram nithin ) , సంగీత్ శోభన్ (Sangeeth Shobhan ) ముగ్గురు హీరోలు లీడ్ రోల్స్ లో నటించి నటించారు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మ్యాడ్ చిత్రానికి సీక్వెల్ గా ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఆ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కావు. పాటల దగ్గర నుంచి డైలాగ్స్ వరకు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. పేరుకి తగ్గట్టే యూత్ కి మూవీ పిచ్చెక్కించింది.
Also Read: TGSRTC: టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇక నుండి ఉద్యోగులకు మరిన్ని వైద్య సేవలు..
కళ్యాణ్ శంకర్ ( Kalyan Shankar) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మించారు. కామెడీతో మ్యాడ్ మూవీలో మనల్ని ఎలా నవ్వించారో కాలేజీ అయ్యాక ఓ మూడేళ్ళ తర్వాత ఏం జరిగిందనేది ఈ సీక్వెల్ లో చూపించారు.
Also Read: Anchor Pradeep: ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడ్డానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ ప్రదీప్
” మ్యాడ్ స్క్వేర్ ” మూవీ మార్చ్ 28న విడుదలయ్యి హిట్ గా నిలిచింది. థియేటర్స్ లో ఆడియెన్స్ ను తెగ నవ్వించేస్తుంది. తాజా లెక్కల ప్రకారం ఈ చిత్రం రూ.70 కోట్లకు పైగ వసూలు చేసింది. త్వరలో ఈ మూవీ రూ. 100 కోట్లు మార్క్ ను చేరుకుంటుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ప్రమోషన్స్ లో కూడా ఎక్కడా తగ్గకుండా చేశారు. ఇప్పుడు, సక్సెస్ మీట్ కు కూడా ప్లాన్ చేస్తున్నారని తెలిసిన సమాచారం.
Also Read: Dharna at Jantar Mantar: కేంద్రంపై బీసీ నేతల పోరుబాట.. ఢిల్లీలో మహా ధర్నాకు సర్వం సిద్దం!
మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ ను ఈ నెల 4 వ తేదీన హైదరాబాద్ లోని ఓ హోటల్ లో నిర్వహించబోతున్నారట. అయితే, ఈ సక్సెస్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలుస్తోంది. దీనిపై, చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దీ సమయం వెయిట్ చేయాల్సిందే.