తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Dharna at Jantar Mantar: కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలంతా ఢిల్లీకి వెళ్లారు. హలో బీసీ..చలో ఢిల్లీ ప్రోగ్రామ్ నిమిత్తం నేతలంతా ఢిల్లీ బాట పట్టారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ నేతలంతా బుధవారం జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాలో పాల్గొననున్నారు. రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసన సభలో చేసిన చట్టాన్ని పార్లమెంట్ లో ఆమోదించాలని బీసీ నేతలు ధర్నా చేయనున్నారు.
BRS Leader Meet Rammohan Naidu: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో బీఆర్ఎస్ ఎంపీలు భేటి.. ఎందుకంటే?
అనంతరం కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ నేతలను కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు చట్టానికి మద్ధతు తెలపాలని కోరనున్నారు. ఇక తెలంగాణలో నిర్వహించిన కుల గణనను దేశ వ్యాప్తంగా నిర్వహించాలని కోరనున్నారు. తెలంగాణ లో పూర్తి చేసిన కుల గణనపై ప్రత్యేక రిపోర్టును కేంద్ర నాయకులకు అందజేయనున్నారు.
ఆ గణాంకాల ప్రకారం ప్రజలకు జరిగే బెనిఫిట్లపై డిస్కషన్ చేయనున్నారు. ఢిల్లీ వెళ్లిన వారిలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీసీ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, వాకిటి శ్రీహరి ,మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రకాష్ గౌడ్, ఈర్లపల్లి శంకరయ్య తదితర నేతలు ఉన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు