Kingdom Thanks Meet
ఎంటర్‌టైన్మెంట్

Nagavamsi: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి నాగవంశీ సంచలన వ్యాఖ్యలు!

Nagavamsi: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’ (Kingdom). ఈ చిత్రం జూలై 31న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri) దర్శకత్వం వహించగా.. సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకోవడంతో టీమ్ హ్యాపీగా ఉంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా వెండితెరపై ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోందని, విజువల్‌గా చాలా బాగుందంటూ చూసిన ప్రేక్షకులు చెబుతుండటంతో పాటు, విమర్శకులు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ గురువారం సాయంత్రం ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపేందుకు థ్యాంక్యూ మీట్‌ని నిర్వహించింది.

Also Read- Deva Katta: ఇద్దరు ప్రాణ స్నేహితుల ప్రయాణం.. ‘మయసభ’ అందరి ఆస్తిలా మారిపోతోంది

ఈ కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగ వంశీ (Nagavamsi) మాట్లాడుతూ.. మొదటి నుంచి మేము అనుకున్నట్టుగానే.. మా సినిమాకి చాలా మంచి స్పందన వస్తోంది. రివ్యూలు కూడా చాలా పాజిటివ్‌గా వచ్చాయి. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో సాంకేతికంగా ఇంత గొప్పగా ఉన్న సినిమా ఇదేననేలా.. మాటలు వినిపిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఒక తెలుగు సినిమాని సాంకేతికంగా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించాం. థియేటర్‌కి వచ్చి సినిమా చూడండి.. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. విజయ్ దేవరకొండ అభిమానులు కోరుకున్నట్టు ఈ సినిమాతో ఆయన హిట్ కొట్టడం చాలా ఆనందంగా ఉంది. అభిమానులను సంతోషపరిచినందుకు చాలా హ్యాపీ. ఈ సినిమాకు అనిరుధ్, నవీన్ నూలి సహా సాంకేతిక నిపుణులు, నటీనటులు ఎంతో ఎఫర్ట్ పెట్టి పని చేశారు. మేము మంచి కంటెంట్‌ని ప్రేక్షకులకు అందించాము. మాకు మీడియా కూడా ఎంతో సపోర్ట్ చేసింది. సినిమా కలెక్షన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. మొదటి రోజే చాలా చోట్ల బిజినెస్ చేసిన దానిలో సగానికి పైగా రాబట్టింది. మాకు మరో విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మా టీమ్ తరపున కృతఙ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

Also Read- HHVM OTT: ‘హరి హర వీరమల్లు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?.. ఇంత ఎర్లీగానా?

సినిమాలో కీలక పాత్రలో నటించిన సత్యదేవ్ (Satyadev) మాట్లాడుతూ.. ఈ సినిమాకు వస్తున్న స్పందనతో మేమంతా సంతోషంగా ఉన్నాం. సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమకు కృతఙ్ఞతలు. ఈ చిత్రం ద్వారా నా సోదరుడు విజయ్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. విజయ్ గెలిస్తే నేను గెలిచినట్లే. సొంతంగా వచ్చి, ఇక్కడ ఏదో సాధించాలి అనుకునే వారందరికీ విజయ్ స్ఫూర్తి. అలాంటి విజయ్ గెలవడం ఆనందంగా ఉంది. నాగవంశీ డేరింగ్ ప్రొడ్యూసర్. అందరూ భయపడే సినిమాలను ఆయన రిస్క్ చేసి తీస్తుంటారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వంశీకి ధన్యవాదాలు. గౌతమ్ ఈ కథ చెప్పగానే.. ఖచ్చితంగా ఈ సినిమా చేయాలని అనుకున్నాను. నేను ఎవరి సినిమా అనేది చూడను.. నా పాత్ర ఎంత వరకు కనెక్ట్ అవుతుందనేది మాత్రమే చూస్తాను. అందుకే ఈ సినిమా కథ చెప్పగానే, చేయకపోతే ఏదో మిస్ అవుతానని అనిపించింది. వెంటనే ఓకే చేశాను. బ్రదర్ సెంటిమెంట్ గురించి, నటీనటుల పర్ఫామెన్స్ గురించి అందరూ పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. వంశీ అన్నట్టు.. ఈ సినిమా హాలీవుడ్ ఎక్స్‌పీరియన్స్‌ని ప్రేక్షకులకు ఇస్తుంది. ఈ ఆనందం, ఉత్సాహంతో ప్రేక్షకులకు మరిన్ని మంచి సినిమాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?