Naga Chaitanya: అక్కినేని ఫ్యామిలీ నుంచి నలుగురు హీరోలు తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. టాలీవుడ్ లోనే మంచి పేరు సంపాదించుకున్న కుటుంబం. అక్కినేని నాగేశ్వరరావు నుంచి మొదలయ్యి.. నాగార్జున కూడా స్టార్డం ను కొనసాగిస్తూ.. ఆ తర్వాత నాగచైతన్య, అఖిల్ కూడా ఇండస్ట్రీ లోకి ఇచ్చారు. వీరిలో అఖిల్ కు ఒక్క సరైన హిట్ కూడా పడలేదు. ఇక నాగచైతన్య ఇటీవలే రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరాడు. ఇక సినీ కెరియర్ పరంగా చైతూకు కలిసి వచ్చినా.. తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అవన్నీ తట్టుకుని ముందుకు వెళ్తున్నాడు.
Also Read: Boys Jeans: జీన్స్‌లను ప్రతిసారీ ఉతకొద్దు.. బయటపడిన షాకింగ్ నిజాలు.. అబ్బాయిలు ఇది మీకోసమే!
మొదటి భార్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత, బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ శోభితను రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు. ఆమె ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేసింది. అంతేకాదు, ఈ బ్యూటీ కి ముంబైలో ఒక పెద్ద కొని అక్కడే నాగచైతన్య తన పుట్టిన రోజు సందర్భంగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారని తెలిసిన సమాచారం. ఆమెకు ఎప్పటికీ గుర్తుండి పోయేలా అన్ని సౌకర్యాలు ఉన్న ఒక ఫ్లాటును రూ.10 కోట్లు పెట్టి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడట.ప్రస్తుతం ఈ వార్తకి సంబంధించిన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
ఎందుకంటే, మొదటి భార్య సమంతతో పెళ్లి అయినా కొత్తలో కూడా ఆమె పుట్టిన రోజుక ముంబైలోనే ఒక ఫ్లాట్ కొని గిఫ్టుగా ఇచ్చినట్టు రూమర్లు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్ ను ఎందుకు ఫాలో అయ్యడా అని అందరికీ అనుమానం వస్తుంది.