Chaitu and Samantha: అక్కినేని యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), సమంత (Samantha) మళ్లీ కలవబోతున్నారా? అంటే అవుననే సంకేతాలే వినబడుతున్నాయి. అయితే కలవడం అంటే మళ్లీ కలిసి జీవించడం కాదు. అలాంటి రోజు మళ్లీ వస్తుందని అనుకోలేం. ఎందుకంటే, ఇద్దరూ ఇష్ట పూర్వకంగానే విడిపోయారు. వారిద్దరూ విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారు అనుభవిస్తున్నారు. రీసెంట్‌గానే నాగ చైతన్య మరో వివాహం కూడా చేసుకున్నారు. నటి శోభితా ధూళిపాలను రెండో వివాహం చేసుకున్న నాగ చైతన్య ప్రస్తుతం హ్యాపీగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మరో వైపు సమంత కూడా రెండో వివాహం చేసుకోబోతున్నట్లుగా ఈ మధ్య వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ దర్శకులలోని ఒకరితో ఆమె ప్రస్తుతం రిలేషన్‌లో ఉందని, త్వరలోనే పెళ్లి కూడా ఉండొచ్చనేలా టాక్ వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు చైతూ, సమంత మళ్లీ కలవబోతున్నారనేలా వార్తలు రావడం.. ‘ఇదేందయ్యా ఇది’ అనేలా కాస్త ఆశ్చర్యాన్ని కలిగించేవే.
అసలు విషయంలోకి వస్తే.. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాల హడావుడి కంటే.. రీ రిలీజ్‌లే హంగామా చేస్తున్నాయి. ఈ రీ రిలీజ్ ట్రెండ్‌లోకి చైతూ, సమంతలని ఒక్కటి చేసిన చిత్రం కూడా వచ్చేసింది. అవును, వారిద్దరూ కలిసి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసిన ‘ఏ మాయ చేసావె’ మూవీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాను జూలై 18న రీ రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు. ఇక రీ రిలీజ్‌లకు కూడా ఈ మధ్య ప్రమోషన్స్‌ని నిర్వహిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ‘అందాల రాక్షసి’ చిత్రానికి అందులో నటించిన హీరోలు, హీరోయిన్ వరస బెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చారు. ఇప్పుడలాంటి ప్రమోషన్సే ‘ఏ మాయ చేసావె’ చిత్రానికి కూడా చేయాల్సి వస్తే.. కచ్చితంగా చైతూ-సామ్ ఇద్దరూ మళ్లీ కలుసుకోవడం అంతా చూడొచ్చు.
Also Read- OTT Rush: ఓటీటీలోకి 32 సినిమాలొస్తే.. అందులో 11 తెలుగు సినిమాలే!
నిజంగా అలాంటి సందర్భమే వస్తే మాత్రం ఇద్దరి అభిమానులకు పండగే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, వారిద్దరూ విడిపోవడం ఇప్పటికీ కొంత మందికి నచ్చడం లేదు. ఇప్పుడు రీ రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమా.. ఒరిజినల్‌గా విడుదలైనప్పుడే వారిద్దరూ ప్రేమలో పడ్డారనే విషయాన్ని స్వయంగా వారే రివీల్ చేశారు. ఇప్పుడా సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తుంది. అప్పటి జ్ఞాపకాలు ఏ మాత్రం గుర్తొచ్చినా.. ఇద్దరూ బాధపడే అవకాశం లేకపోలేదు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏమిటనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. అంతగా ప్రేమించుకున్న వాళ్లు విడిపోయారంటే.. ఏదో బలమైన కారణమే ఉందనేలా టాక్ అయితే ఇంకా నడుస్తూనే ఉంది. మరి ఇలాంటి సందర్భంలో వీరిద్దరూ.. సినిమా ప్రమోషన్స్ నిమిత్తం మళ్లీ కలిస్తే.. ఎలా ఒకరినొకరు ఫేస్ చేస్తారనేది చూడటానికి టాలీవుడ్ మొత్తం వేచి చూస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు