OTT Rush: రెండు రోజల వ్యవధిలో దాదాపు 32 సినిమాలు ఓటీటీలో సందడి చేయడానికి వచ్చాయి. అందులో ఈసారి 11 వరకు తెలుగు సినిమాలే ఉండటం విశేషం. థియేటర్లలో సరైన సినిమా లేకపోవడంతో.. ఈ వారం ఓటీటీలోకి జనాలు అతుక్కుపోయారు. ఆ సినిమా, ఈ సినిమా అనే తేడాలు లేకుండా అన్ని సినిమాలను వరసబెట్టి చూస్తున్నారు. మాములుగా అయితే ఈ వారం బాక్సాఫీస్ దగ్గర ‘హరి హర వీరమల్లు’ సందడి చేయాలి. కానీ చివరి నిమిషంలో ఆ సినిమా వాయిదా పడటంతో.. కొన్ని డబ్బింగ్, చిన్న సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. వీటిని థియేటర్లకు వెళ్లి చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఇష్టపడటం లేదు. ఆ ప్లేస్‌లో ఓటీటీలపై పడ్డారు. ఆ ఓటీటీ, ఈ ఓటీటీ అని కాకుండా అన్ని ఓటీటీలలోని సినిమాలు మంచి ఆదరణను రాబట్టుకుంటుండటమే ఇందుకు ఉదాహరణ.
Also Read- Dil Raju: ప్రభుత్వం అవార్డులు ఇస్తుంటే.. తీసుకోవడానికి రారా? దిల్ రాజు ఫైర్!
ఇక లాస్ట్ గురు, శుక్ర వారాల్లో ఏమేం సినిమాలు ఓటీటీల్లోకి వచ్చాయంటే..
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ (Amazon Prime Video OTT)
డీప్ కవర్- జూన్ 12 (హిందీ డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్)
ది ట్రేయిటర్స్- జూన్ 12 (హిందీ రియాలిటీ షో)
లెవెన్- జూన్ 13 (తెలుగు, తమిళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫిల్మ్)
బ్లైండ్ స్పాట్- జూన్ 13 (తెలుగు మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఫిల్మ్)
ఏస్- జూన్ 13 (తెలుగు, తమిళ రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఫిల్మ్)
ఫ్లైట్ రిస్క్- జూన్ 13 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఫిల్మ్)
బొంజౌర్ ట్రిస్టెస్సే- జూన్ 13 (ఇంగ్లీష్ ఫ్యామిలీ రిలేషన్‌షిప్ డ్రామా ఫిల్మ్)
ఇన్ ట్రాన్సిట్- జూన్ 13 (హిందీ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ (Netflix OTT)
ఫ్లాట్ గర్ల్స్- జూన్ 12 (థాయి డ్రామా ఫిల్మ్)
అండ్ ద బ్రెడ్ విన్నర్ ఈజ్- జూన్ 12 (ఫిలిప్పీన్ ఫ్యామిలీ కామెడీ డ్రామా ఫిల్మ్)
ఫ్యూబర్ సీజన్ 2- జూన్ 12 (ఇంగ్లీష్ స్పై థ్రిల్లర్ యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్)
మసామీర్ జూనియర్- జూన్ 12 (సౌదీ అరేబియన్ యానిమేటెడ్ కామెడీ వెబ్ సిరీస్)
సెల్స్ ఎట్ వర్క్- జూన్ 13 (జపనీస్ ఫాంటసీ యాక్షన్ కామెడీ ఫిల్మ్)
రానా నాయుడు సీజన్ 2- జూన్ 13 (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)
కింగ్స్ ఆఫ్ జోబర్గ్ సీజన్ 3- జూన్ 13 (సౌత్ ఆఫ్రికన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)
ఏ బిజినెస్ ప్రపోజల్- జూన్ 13 (సౌత్ కొరియన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)
టూ హాట్ టు హ్యాండిల్: స్పెయిన్- జూన్ 13 (స్పానిష్ రియాలిటీ డేటింగ్ గేమ్ షో)
జియో హాట్‌స్టార్ ఓటీటీ (Jio Hotstar OTT)
ది రియల్ హౌస్‌వైవ్స్ ఆఫ్ మియామీ సీజన్ 4- జూన్ 12 (అమెరికన్ రియాలిటీ వెబ్ సిరీస్)
శుభం- జూన్ 13 (తెలుగు కామెడీ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)
కేసరి చాప్టర్ 2- జూన్ 13 (హిందీ హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా ఫిల్మ్)
Also Read- Mohanlal: కాల్చి చంపేస్తా.. అంటూ మోహన్ బాబుకు మోహన్ లాల్ వార్నింగ్!
సన్ నెక్ట్స్ ఓటీటీ (Sun Nxt OTT)
డియర్ ఉమ- జూన్ 13 (తెలుగు మెడికల్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)
మర్యాదే ప్రశ్నే- జూన్ 13 (కన్నడ రివేంజ్ డ్రామా ఫిల్మ్)
ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ ఎకో వ్యాలీ- జూన్ 13 (ఇంగ్లీష్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)
నాట్ ఏ బాక్స్- జూన్ 13 (ఇంగ్లీష్ యానిమేటెడ్ ఫ్యామిలీ వెబ్ సిరీస్)
జీ5 ఓటీటీ (Zee5 OTT)
డెవిల్స్ డబుల్ నెక్ట్స్ నెక్ట్స్ లెవెల్- జూన్ 13 (తెలుగు డబ్బింగ్ తమిళ హారర్ కామెడీ ఫిల్మ్)
మామన్- జూన్ 13 (తమిళ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్)
ఈటీవీ విన్ ఓటీటీ (ETV Win OTT)
ఆ ఒక్కటి అడక్కు- జూన్ 12 (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)
చౌపల్ ఓటీటీ
జోడీ- జూన్ 12 (పంజాబీ రొమాంటిక్ కామెడీ చిత్రం)
ఆహా ఓటీటీ (Aha OTT)
కార్తిక మిస్సింగ్ కేస్- జూన్ 13 (తెలుగు మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫిల్మ్)
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
ది ప్రాసిక్యూటర్- జూన్ 13 (తెలుగు డబ్బింగ్ చైనీస్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)
హోయ్‌చోయ్ ఓటీటీ
హెమ్‌లాక్ సొసైటీ- జూన్ 13 (బెంగాలీ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)
హెచ్‌బీవో మ్యాక్స్ ఓటీటీ
క్లీనర్- జూన్ 13 (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు