YouTube Clash: ‘హే జ్యూడ్’పై మరోసారి విరుచుకుపడ్డ అన్వేష్..
na-anvesh-counter
ఎంటర్‌టైన్‌మెంట్

YouTube Clash: ‘హే జ్యూడ్’ ఫ్యామిలీపై మరోసారి విరుచుకుపడ్డ అన్వేష్.. వామ్మో ఏంటామాటలు?

YouTube Clash: తెలుగు యూ ట్యూబర్ ‘నా అన్వేషణ’ ఛానల్ నిర్వాహకుడు అన్వేషణ మరో సారి హే జ్యూడ్ ఫ్యామిలీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విరుచుకు పడ్డాడు. తనను లక్ష్యంగా చేసుకుని హే జ్యూడ్ వీడియోలు చేస్తున్నాడని తనను పాయింట్ చేసి లక్షలు కొల్ల గొడుతున్నాడని అన్వేష్ ఆరోపించాడు. అక్కడితో ఆగకుండా ఈ విషయంలోకి హే జ్యూడ్ కుటుంబాన్ని కూడా అన్వేష్ తీసుకొచ్చారు. ముఖ్యంగా హే జ్యూడ్ తమ్ముడి గురించి అతను చేసిన పనులగురించి చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Read also-Allu Aravind: ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’పై మాస్టర్ మైండ్ స్పందనిదే..

పెంపకంపై విమార్శలు..

హే జూడ్ తండ్రి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అని, తల్లి ప్రముఖ మానసిక వైద్యురాలు (డాక్టర్) అని పేర్కొంటూ, ఇంత విద్యావంతులైన తల్లిదండ్రులు తమ పిల్లలను సరైన మార్గంలో ఎందుకు పెంచలేకపోయారని అన్వేషణ్ ప్రశ్నించారు. సమాజంలో గొప్ప హోదాల్లో ఉండి కూడా, ఇంట్లోని పేషెంట్‌ను (తమ్ముడిని ఉద్దేశించి) మేడం గారు ఎందుకు నయం చేయలేకపోయారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా హే జూడ్ తమ్ముడు ప్రణీత్ హనుమంతు, డార్క్ కామెడీ పేరుతో ఒక తండ్రి అతని చిన్న కూతురి మధ్య బంధాన్ని కించపరిచేలా మాట్లాడి, పోక్సో (POCSO) కేసులో జైలుకు వెళ్లిన విషయాన్ని అన్వేషణ్ గుర్తు చేశారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఒకరికొకరు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడంపై మండిపడ్డాడు.

Read also-Chiranjeevi USA: నార్త్ అమెరికా కలెక్షన్లలో ఆ రికార్డును బ్రేక్ చేసిన ‘మన శంకరవరప్రసాద్ గారు’.. ఎంతంటే?

‘దమ్ముంటే బయటకు రా?’

తన తమ్ముడు చేసిన తప్పు వల్ల కుటుంబంపై పడ్డ మచ్చను తుడిచేసుకోవడానికి, హే జూడ్ ఇప్పుడు హఠాత్తుగా భక్తుడి అవతారం ఎత్తారని అన్వేషణ్ ఆరోపించారు. ‘జై శ్రీరామ్’ అంటూ మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతూ, తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. హే జూడ్ గతంలో బీటెక్ పూర్తి చేయడానికి ఎన్నేళ్లు పట్టిందో, పైలట్ అవ్వడంలో ఎలా విఫలమయ్యారో ప్రస్తావిస్తూ.. ఏదీ సాధ్యం కాక కుర్చీలో కూర్చుని సోది చెప్పే కంటెంట్ చేస్తున్నారని విమర్శించారు. తనలాగా కష్టపడి ప్రపంచం చుట్టూ తిరిగే వ్యక్తికి, ఇంట్లో కూర్చుని వీడియోలు చేసే వారికి పోలిక లేదని అన్వేషణ్ స్పష్టం చేశారు. యూట్యూబ్ వేదికగా జరుగుతున్న ఈ మాటల యుద్ధం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అన్వేషణ్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలపై హే జూడ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Just In

01

Harish Rao: నల్లమల సాగర్ కు సహకరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నీళ్ల శాఖ మంత్రిపై హరీష్ రావు ఫైర్!

Kishore Tirumala: ‘బి.ఎమ్.డబ్ల్యూ’లో ఆ ప్రశ్నే ఇంపార్టెంట్.. విడాకులకు కారణమదే!

Kodanda Reddy: నకిలీ విత్తనాలు అరికట్టడంలో.. గత ప్రభుత్వం విఫలమైంది.. కోదండ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Nayanthara: ఒక సామ్రాజ్యమే.. నయనతార ఆస్తుల విలువల తెలిస్తే షాకవ్వాల్సిందే..

Huzurabad: ఆ జిల్లా కార్మిక శాఖలో ప్రైవేట్ రాజ్యం.. ప్రభుత్వ కార్యాలయమా? లేక ప్రైవేట్ వ్యక్తుల దందా కేంద్రమా?