Chiranjeevi USA: తెలుగు చిత్ర పరిశ్రమలో ‘బాస్’ అంటే కేవలం పేరు మాత్రమే కాదు, అదొక బాక్సాఫీస్ బ్రాండ్ అని మెగాస్టార్ చిరంజీవి మరోసారి నిరూపించారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana ShankaraVaraPrasad Garu) అమెరికా గడ్డపై రికార్డుల సునామీ సృష్టిస్తోంది. సాధారణంగా ఏ సినిమాకైనా మొదటి రోజు కలెక్షన్లు కీలకం, కానీ చిరంజీవి సినిమా మాత్రం కేవలం ప్రీమియర్ షోల తోనే భారీ వసూళ్లను సాధించింది. నార్త్ అమెరికాలో ఈ చిత్రం $1.5 మిలియన్ల మార్కును దాటింది. ప్రస్తుత దీని విలువ ప్రకారం ఇది సుమారు రూ.12.50 కోట్ల నుండి రూ.13 కోట్లకు పైమాటే. మెగాస్టార్ కెరీర్‌లో ప్రీమియర్ల ద్వారానే ఈ స్థాయి వసూళ్లు సాధించడం ఇదే తొలిసారి. ఇది ఆయన స్టామినాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
Read also-Theatre Tragedy: మెగాస్టార్ సినిమా చూస్తూ కుప్పకూలిన రిటైర్డ్ ఏఎస్ఐ.. ఏం జరిగిందంటే?
ప్రపంచవ్యాప్తంగా మెగా సందడి
అమెరికాలోనే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం సుమారు వంద కోట్లు మార్క్ దాటే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.160 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, మొదటి వారాంతంలోనే సగానికి పైగా పెట్టుబడిని వెనక్కి తెచ్చేలా కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత చిరంజీవి తన మార్కు కామెడీ గ్రేస్‌ఫుల్ డ్యాన్స్‌లతో ప్రేక్షకులను అలరించడంతో ఈ సినిమా విజయం సాధించింది. దర్శకుడు అనిల్ రావిపూడి మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను చక్కగా మేళవించడం ఈ సినిమాకు ప్లేస్ పాయింట్ అయింది. సంక్రాంతి సెలవులు ఈ సినిమా కలెక్షన్లకు మరో పెద్ద ప్లస్ పాయింట్‌గా మారాయి.
Read also-RajaSaab Collections: ప్రభాస్‘ది రాజాసాబ్’ మూడురోజుల గ్రాస్ కలెక్షన్లు ఎంతంటే?..
ఇప్పటికే సినిమా చూసేందుకు అభిమానులు మాత్రమే కాకుండా ఫ్యామిలీ అంతా కాలిసి థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో అనిల్ రావిపూడి మరో సారి తన హిట్ మెషిన్ కంటిన్యూ చేశారు. వరుసగా 9 హిట్ సినిమాలు తీసి టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా అనిల్ తన పేరు నిలబెట్టుకున్నారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా వింటేజ్ మెగాస్టార్ను గుర్తు చేస్తాడు. ఇప్పటికే సినిమా చూసిన అలనాటి మెగా ఫ్యాన్స్ థియేటర్ల వద్ద తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడే కాకుండా అమెరికాలో కూడా మెగాస్టార్ తన ప్రభంజనం కొనసాగిస్తున్నారు. ఈ సంక్రాంతికి మెగాస్టార్ హిట్టు కొట్టి బాక్సాఫీస్ వద్ద మరో సారి తన స్టామినా ఏంటో తెలిపారు.
BOX OFFICE is now under Boss control 💥💥#ManaShankaraVaraPrasadGaru North America Premieres Gross crosses $1.5MILLION+ ❤️🔥
ALL TIME PREMIERES RECORD for Megastar @Kchirutweets 💥#MegaBlockBusterMSG In Cinemas Now 🔥
Overseas by @SarigamaCinemas
Victory @venkymama… pic.twitter.com/10F7VpT4y3
— Shine Screens (@Shine_Screens) January 12, 2026

