Trinadha Rao Nakkina: ‘మేం వయసుకు వచ్చాం’ అనే చిత్రంతో త్రినాథరావు నక్కిన డైరెక్టర్‌గా తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యాడు. మంచి ప్రేమకథతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో త్రినాథరావు నక్కిన మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ‘ప్రియతమా నీవచట కుశలమా, సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. తాజాగా ‘మజాకా’ (Mazaka) అనే చిత్రానికి దర్శకత్వం వహించగా.. ఈ మూవీ ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. సందీప్ కిషన్ (Sundeep Kishan) సరసన రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, అన్షు మరో జంటగా కనిపించనున్నారు. అయితే ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అన్షుని ఉద్దేశించి త్రినాథరావు చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారిన విషయం తెలిసిందే. ఆ అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుని నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు మహిళా లోకం, సినీ ప్రముఖులు సైతం త్రినాథరావు నక్కిన కామెంట్స్‌పై మండిపడ్డారు. దీంతో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన క్షమాపణలు చెప్పక తప్పలేదు.
Also Read- Megastar Chiranjeevi: ‘మజాకా’ను అందుకే మెగాస్టార్ పక్కన పెట్టేశాడా?
తాజాగా ‘మజాకా’ ప్రమోషన్స్‌లో భాగంగా మరోసారి ఈ కామెంట్స్‌పై దర్శకుడు స్పందించాడు. ఆ రోజు అన్షు (Anshu)ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని, సడెన్‌గా అనుకోకుండా అలా మాట్లాడానని చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై తన తల్లి కూడా చాలా బాధపడిందని తెలిపారు. అయితే ఆ రోజు ఆడియన్స్, మీడియా మిత్రులను నవ్వించే ఉద్దేశంతో అలా వ్యాఖ్యలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. తనవి ఉద్దేశ పూర్వకంగా వచ్చిన మాటలు కావని, ఆ సందర్భంలో అలా వచ్చాయని తెలిపారు. అప్పటి నుంచి స్టేజ్‌పై మాట్లాడేటప్పడు జాగ్రత్తగా ఉండాలని అర్థం అయ్యిందని అన్నారు. అయితే అప్పుడు అసలు ఏం జరిగిందో హీరోయిన్ అన్షుకి కూడా తెలియదని అన్నారు. తను కాల్ చేసి అసలు ఏం జరుగుతుందని అడిగిందని, క్లియర్‌గా ఆమెకు అర్థం అయ్యేలా చెప్పానని అన్నారు. ఆమె తనను అర్థం చేసుకుందని వెల్లడించారు.
ఇంకా ఈ వివాదంతో తన తల్లి బాగా డిస్టర్బ్ అయిందని, వన్ వీక్ వరకు తను మనిషి కాలేదని చెప్పుకొచ్చారు. కష్టపడి తెచ్చుకున్న పేరును చిన్న మాటతో పోగొట్టుకున్నావని బాధపడిందని, నువ్వు మంచివాడివి అయినా నీ మాటల వల్ల నిన్ను అందరూ దారుణంగా మాట్లాడుతున్నారని, ఆ ఒక్క పదం దుర్మార్గుడిని చేసిందని అమ్మ ఫీల్ అయ్యిందని చెప్పారు. ఫ్యూచర్‌లో స్టేజ్‌పై మాట్లాడేటపుడు జాగ్రతగా మాట్లాడాలని చెప్పిందని అన్నారు. ఈ వివాదంపై అమ్మ దాదాపు వారం రోజులు బాధపడిందని, ఇప్పటికీ బయటకు రాలేకపోతుందని వెల్లడిస్తూ.. భవిష్యత్‌లో ఎప్పుడూ ఇలా మాట్లాడనని మీడియాకు తెలిపారు.