MSG Movie: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) బాక్సాఫీస్ దగ్గర రఫ్ఫాడించేస్తున్నారు. అవును సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasada Garu) మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఎంతలా అంటే, కేవలం ఆరంటే ఆరే రోజుల్లో అన్ని ఏరియాల్లో బ్రేకీవెన్ అయ్యేంతగా. ఈ విషయం తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. కేవలం ఆరు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేకీవెన్ అయినట్లుగా ఈ పోస్టర్‌లో మేకర్స్ ప్రకటించారు. అదీ కూడా శనివారం నాటికే. ఆదివారం అంతా లాభాలే. ఆదివారం కూడా ఈ సినిమా అన్ని చోట్ల హౌస్‌ఫుల్ బోర్డ్స్‌లో రన్ అవుతోంది. ఈ సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు మంచి టాక్‌ని సొంతం చేసుకున్నాయి. ముందుగా వచ్చిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా, యాడ్ చేసిన సీన్ల తర్వాత.. సినిమా బాగుందంటూ టాక్ నడిచింది.
Also Read- Peddi Update: బీస్ట్ మోడ్ స్టిల్స్‌తో ఇంటర్నెట్ షేక్! ‘పెద్ది’ తాజా అప్డేట్ ఇదే..
చిన్న పిల్లల నుంచి పండు ముదుసలి వరకు
‘ది రాజా సాబ్’ తర్వాత మెగాస్టార్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’గా థియేటర్స్‌లోకి దిగారు. రిలీజ్‌కు ముందు రోజు పడిన ప్రీమియర్స్‌కే ఈ సినిమా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని, రిలీజ్ డే నుంచి ఇప్పటి వరకు అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతూనే ఉంది. వింటేజ్ మెగాస్టార్‌ని చూసేందుకు ఒకప్పటి రోజులను తలపిస్తూ.. బళ్లు, ట్రాక్టర్స్, ఆటోలలో జనాలు థియేటర్లకు తరలివస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్న విషయం తెలియంది కాదు. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పండు ముదుసలి వరకు ఈ సినిమాను చూసేందుకు వస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో థియేటర్లకు జనాలు రావడం తగ్గించేశారనేలా నిర్మాతలెందరో తలలు బాదుకుంటున్నారు. అలాంటిది సరైన కంటెంట్‌తో, సరైన టైమ్‌లో సినిమా పడితే ఎలా ఉంటుందో, ఎందుకు ప్రేక్షకులు తరలిరారో.. అనేదానికి ఉదాహరణగా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నిలుస్తున్నారు.
Also Read- Sanjay Dutt: ముంబై రోడ్లపై సంజయ్ దత్ ‘టెస్లా సైబర్‌ట్రక్’ హవా.. కిర్రాక్ ఎంట్రీ!
ఆల్ టైమ్ హయ్యస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్
ప్రస్తుతం ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా బ్రేకీవెన్ సాధించి, లాభాల బాటలో నడుస్తోంది. ఓవర్సీస్‌లో అయితే, విడుదలైన మూడో రోజు నుంచే ఈ సినిమా లాభాల బాటను పట్టింది. ప్రస్తుతం వచ్చే కలెక్షన్స్ మొత్తం లాభాలే. మొత్తం ఈ మూవీ 6 రోజులకు గానూ వరల్డ్ వైడ్‌గా రూ. 261కి పైగా కలెక్షన్స్ (MSG Collections)ను రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. ఓవర్సీస్‌లో అయితే మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే ఆల్ టైమ్ హయ్యస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా ఈ సినిమా రికార్డును క్రియేట్ చేసిందని చిత్రయూనిట్ తెలుపుతూ పోస్టర్ విడుదల చేసింది. ఈ సక్సెస్‌తో మెగాస్టార్ చిరంజీవిపై కొన్నాళ్లుగా జరుగుతున్న ట్రోలింగ్‌కు కూడా బ్రేక్ పడింది. సరైన సినిమా పడితే మెగాస్టార్ స్టామినా ఏంటో, బాక్సాఫీస్ ఎలా ఉంటుందో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తెలియజేస్తున్నారంటూ.. మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
The whole world is celebrating MEGASTAR in his forte ❤️🔥❤️🔥❤️🔥#ManaShankaraVaraPrasadGaru BREAKEVEN COMPLETED in just 6 days 💥💥💥
ALL AREAS INTO PROFIT ZONE 😎
The blockbuster journey continues with a rock-solid box office run 🔥
Book your tickets now for… pic.twitter.com/KGBRwkbxN6
— Shine Screens (@Shine_Screens) January 18, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

