Peddi Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi Movie). ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా బయటకు వచ్చిన అప్‌డేట్స్ మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెడుతున్న విషయం తెలియంది కాదు. సినిమా కోసం చరణ్ పడుతున్న కష్టం అంతా తాజాగా విడుదలైన ‘బీస్ట్ మోడ్’ (Ram Charan in Beast Mode) స్టిల్స్‌లో కనిపిస్తోంది. గెడ్డం పెంచి, రాక్ సాలిడ్ మజిల్స్ చూపిస్తూ, కళ్ళలో ఒక రకమైన ఇంటెన్సిటీతో చరణ్ కనిపిస్తున్న తీరు చూస్తుంటే.. బాక్సాఫీస్ దగ్గర ఈసారి లెక్కలు మారిపోతాయని అర్థమవుతోంది. ఈ లుక్ కోసం ఆయన ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారు. త్వరలోనే ప్రారంభం కాబోయే బిగ్ షెడ్యూల్ కోసం చరణ్ పూర్తిగా సిద్ధమైనట్లుగా ఈ స్టిల్స్ తెలియజేస్తున్నాయి.
Also Read- VV Vinayak: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చూసిన మాస్ డైరెక్టర్ స్పందనిదే..
‘చికిరి చికిరి’ రికార్డుల మోత
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు ప్రాణం పోస్తున్నారు. ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ సృష్టించిన, సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఐదు భాషల్లో కలిపి ఇప్పటికే 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి గ్లోబల్ రికార్డులను బద్దలు కొట్టిందీ పాట. చరణ్ అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్, రెహమాన్ ఎనర్జిటిక్ మ్యూజిక్‌తో ఈ పాట ఒక ఇంటర్నేషనల్ హిట్‌గా దూసుకెళుతోంది. త్వరలోనే రెండో పాటను విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. రెండో పాట ఆల్రెడీ సిద్ధమైందని, దీని కోసం ప్రత్యేకంగా ఓ వీడియోను కూడా చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఈ పాట కూడా అందరికీ పూనకాలు తెప్పించేలా, రెహమాన్ కంపోజ్ చేశారనేలా టాక్ నడుస్తోంది. త్వరలోనే సెకండ్ సాంగ్ రిలీజ్ అప్డేట్ రానుంది.
Also Read- Gandhi Talks Teaser: ఒక్క మాట లేదు, అంతా మౌనం.. టీజరంతా డబ్బు, మ్యూజిక్కే!
మార్చి 27నే విడుదల
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. అందాల నటి జాన్వీ కపూర్ ఈ సినిమాలో చరణ్‌కు జంటగా నటిస్తోంది. వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై మ్యాజిక్ చేయబోతోందని ‘చికిరి’తోనే క్లారిటీ వచ్చేసింది. బుచ్చిబాబు ఈ కథను అత్యంత భావోద్వేగంగా, అదే సమయంలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తీర్చిదిద్దుతున్నారు. చరణ్ కెరీర్‌లో మర్చిపోలేని హిట్ ఇచ్చిన ‘రంగస్థలం’ మార్చి నెలలోనే విడుదలైంది. ఇప్పుడు ‘పెద్ది’ కూడా మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌గా గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ ఎత్తున విడుదలయ్యే ఈ సినిమా, చరణ్ క్రేజ్‌ను మరో మెట్టు ఎక్కించడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’ చరిత్ర సృష్టించబోతోందని ట్రేడ్ వర్గాలు సైతం విశ్లేషిస్తుండటం విశేషం.
Our #Peddi is all FIRED UP 🔥🔥
Gearing up for the next big schedule ❤🔥#PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026. pic.twitter.com/Nvq2ziZMNK
— PEDDI (@PeddiMovieOffl) January 17, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

