VV Vinayak: ‘పండక్కి పండగ సినిమాలాగా వచ్చి, అసలు ఊహించనంతగా రెవిన్యూ, ఎవరూ ఊహించనంత డబ్బు చేస్తుంది ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) మూవీ’ అని అన్నారు మాస్ డైరెక్టర్ వివి వినాయక్ (VV Vinayak). ఈ సినిమాను చూసిన ఆయన ప్రత్యేకంగా మెగాస్టార్‌కు, విక్టరీ వెంకటేష్‌కు, దర్శకుడు అనిల్ రావిపూడికి అభినందనలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో వచ్చి బాక్సాఫీస్ దగ్గర మెగా బ్లాక్ బస్టర్‌గా దుమ్మురేపుతోన్న చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పించారు. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలో వివి వినాయక్ మాట్లాడుతూ..
Also Read- Gandhi Talks Teaser: ఒక్క మాట లేదు, అంతా మౌనం.. టీజరంతా డబ్బు, మ్యూజిక్కే!
ఆ సీన్లు హైలెట్
‘‘బహుశా ఈ జనరేషన్ స్టార్స్‌లో ఆయనొక్కరికే ఆ గౌరవం దక్కింది. అందరూ చిరంజీవిగారి సినిమా టికెట్లు కావాలి, చిరంజీవిగారి సినిమా టికెట్లు కావాలని అంటున్నారే తప్ప.. చిరంజీవి అని ఎవరూ ఏకవచనంతో అనడం లేదు. నిజంగా అది ఈ జనరేషన్ హీరోస్‌లో ఆయన సాధించిన విజయమని నేను అనుకుంటున్నాను. సినిమాలో యాక్ట్ చేసిన అందరూ, వెంకటేష్, నయనతార వంటి అందరూ అద్భుతంగా చేశారు. పండక్కి పండగ సినిమాలాగా అసలు ఊహించనంతగా రెవిన్యూ, ఎవరూ ఊహించనంత డబ్బు చేస్తుందీ సినిమా. ఇందులో మెగాస్టార్ కామెడీ, సాంగ్స్ గురించి మాట్లాడుతున్నారు. అత్తా కోడళ్ల మధ్య అనిల్ రావిపూడి ఓ సీన్ చేశాడు. అలాగే పిల్లలతో మెగాస్టార్ మాట్లాడే సీన్.. నిజంగా హ్యాట్సాఫ్ టు అనిల్. అంత పరిణితి చెందినట్లుగా ఆ సీన్ రాశాడు, తను తీశాడు. ఆ సీన్స్ చాలా గొప్ప సీన్స్. వాటి గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నారు కానీ, అవి చాలా మంచి సన్నివేశాలు. పండగ హడావుడి పూర్తయిన తర్వాత కూడా ఈ సినిమా డబ్బులు తీసుకొచ్చే సీన్స్ అవి.
Also Read- MSG Collections: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ 5 డేస్ కలెక్షన్స్.. మైండ్ బ్లోయింగ్!
ప్రతి యంగ్‌స్టర్‌తో సినిమా చేయాలి
ఇవివి సత్యనారాయణ తర్వాత వరసగా హిట్స్ ఇస్తూ.. అటు ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, మంచి సెంటిమెంట్, మ్యూజిక్.. అన్నింటితో ప్రతి పండక్కి మంచి హిట్ కొడుతున్నాడు మై బ్రదర్ అనిల్ రావిపూడి. ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి ఇంత పెద్ద హిట్ వచ్చినందుకు మరొక్కసారి, ఇలాంటి హిట్స్ కొడుతూ ఆయన ఇంకా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంత గౌరవం సాధించుకోవడమే ఆయన సాధించిన విజయం. నాకు ఆయనతో రెండు సినిమాలు చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్నయ్యా. ఇప్పుడు మీతో సినిమా చేయాలని ప్రతి యంగ్‌స్టర్ అనుకుంటాడు. ప్రతి యంగ్‌స్టర్‌కి మీతో సినిమా చేసే అదృష్టం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు. దీనికి అనిల్ రావిపూడి కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. వినాయక్‌కు థ్యాంక్స్ చెప్పారు.
Thank u so much vinay sir❤️❤️❤️❤️❤️❤️
U are always there for me😍😍🙏🙏
Love u sir https://t.co/tUWtujhxtd— Anil Ravipudi (@AnilRavipudi) January 17, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

