MS Subbulakshmi: భారతదేశ సినీ చరిత్రలో, సంగీత ప్రపంచంలో తన గానంతో చెరగని ముద్ర వేసిన లెజెండరీ సింగర్ ఎం.ఎస్. సుబ్బులక్ష్మి (M.S. Subbulakshmi) జీవిత చరిత్ర వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ (Geetha Arts) నిర్మించనున్నట్లు సినీ వర్గాల సమాచారం. అల్లు అరవింద్ సారథ్యంలోని ఈ సంస్థ ఈ బయోపిక్‌ను అత్యంత భారీ స్థాయిలో, కళాత్మక విలువలతో రూపొందించడానికి సన్నాహాలు చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వార్త అధికారిక ప్రకటన గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read also-Bigg Boss9: బిగ్ బాస్ సీజన్ 9 అల్టిమేట్ యోధులు వీరే.. చివరిగా బిగ్ బాస్ చెప్తుంది ఏంటంటే?
టైటిల్ పాత్రలో..
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి వంటి దిగ్గజ గాయని పాత్రలో నటించడం అంటే ఏ నటికైనా ఒక అరుదైన అవకాశం. ఆ పాత్రకు న్యాయం చేయగల నటి కోసం వెతికిన యూనిట్, ఆ స్థానంలో సాయి పల్లవిని (Sai Pallavi) ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయి పల్లవి తన సహజ నటన, అద్భుతమైన అభినయ సామర్థ్యంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటారు. సుబ్బులక్ష్మి పాత్రకు అవసరమైన సంస్కృతి, కళాత్మకత, నిష్కపటమైన రూపం సాయి పల్లవిలో పుష్కలంగా ఉన్నాయని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్రలో సాయి పల్లవిని చూడాలని అభిమానులు కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read also-Soggadu Re-release: శోభన్ బాబు ‘సోగ్గాడు’ మళ్లీ వస్తున్నాడు థియేటర్‌లలోకి.. ఎప్పుడంటే?
దర్శకత్వం ఎవరంటే?
ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించే బాధ్యతను టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి (Gowtham Tinnanuri) తీసుకోనున్నారు. ‘మళ్లీ రావా’, జాతీయ అవార్డు గెలుచుకున్న ‘జెర్సీ’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సున్నితమైన భావోద్వేగాలను తెరకెక్కించడంలో గౌతమ్‌కు ఉన్న ప్రత్యేకమైన శైలి, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితంలోని ఎత్తుపల్లాలను అద్భుతంగా ఆవిష్కరిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి చేశారని, సుబ్బులక్ష్మి జీవితాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి ఈ కథను సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి సంగీత ప్రపంచంలో చేసిన కృషి, ఆమె పొందిన భారతరత్న వంటి అరుదైన గౌరవాలు, ఆమె వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలు ఈ బయోపిక్‌లో ప్రధానంగా ఉండనున్నాయి. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్, సాయి పల్లవి లాంటి అద్భుతమైన నటి, గౌతమ్ తిన్ననూరి లాంటి సమర్థవంతమైన దర్శకుడు కలవడం ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

