Bigg Boss9: బుల్లి తెర ప్రేక్షకులను గత మూడు నెలలుగా అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9. ఈ షో దాదాపు చివరి అంకానికి చేరుకుంది, ఇప్పటికే సభ్యులు అందరూ ఎలిమినేటర్ అయిపోయి అల్టిమేట్ యోధులు అయిదుగురు మాత్రమే మిగిలారు. పవన్, డీమాన్ వపన్, తనూజ ఇమ్మానియేల్, సంజన ఈ అయిదుగురు మాత్రమే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు. తాజాగా జరిగిన షో లో డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా ఆదివారం భరణి కూడా ఎలిమినేట్ అయ్యారు. మిగిలిన అయిదుగురు మధ్య గేమ్ సాగనుంది. వీరి అయిదుగురికీ అయిదు రోజులు గేమ్ మాత్రమే మిగిలి ఉంది. అందులో వీరికి కొత్త టాస్కులు ఇవ్వకుండా బిగ్ బాస్ ఏం చెప్పారు అంటే? ఈ సారి ప్రేక్షకుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కొన్ని టాస్క్ లను చివరిగా రిప్లే చేయాలని బిగ్ బాస్ చెప్పారు. దీంతో గేమ్స్ ఆడేందుకు అందరూ మళ్లీ ముందుకు వచ్చారు. బిగ్ మాస్ హౌస్ లోని వారికి రోజుకొకరికి తమ ఆత్మీయులైన వారు సందేశం ఇస్తారు.
Read also-Soggadu Re-release: శోభన్ బాబు ‘సోగ్గాడు’ మళ్లీ వస్తున్నాడు థియేటర్‌లలోకి.. ఎప్పుడంటే?

