Soggadu Re-release: తెలుగు చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన క్లాసిక్ చిత్రాలలో నట భూషణ శోభన్ బాబు నటించిన ‘సోగ్గాడు’ ఒకటి. ఈ ఎవర్‌గ్రీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ విడుదలై నేటికి సరిగ్గా 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ అపురూప సందర్భాన్ని పురస్కరించుకుని, సినీ ప్రేమికులకు ఒక మధురమైన కానుకగా, ఈ బ్లాక్‌బస్టర్ క్లాసిక్‌ను డిసెంబర్ 19వ తేదీన ఎంపిక చేసిన థియేటర్లలో రీ-రిలీజ్ చేయబోతున్నారు. ‘సోగ్గాడు’ చిత్రం కేవలం ఒక విజయవంతమైన సినిమా మాత్రమే కాదు, శోభన్ బాబు గారి కెరీర్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చిన మైలురాయి. ఈ సినిమా విజయం తరువాతే ఆయన ఇంటి పేరు ‘సోగ్గాడు’గా స్థిరపడింది. ‘సోగ్గాడు’ పాత్రలో శోభన్ బాబు చూపిన అద్భుతమైన అభినయం, ముఖ్యంగా ఆయన స్టైల్, డ్రెస్సింగ్ సెన్స్ మరియు హుందా అయిన బాడీ లాంగ్వేజ్ యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో నటించిన జయసుధ, జయప్రద ఆనాటి గ్లామర్, నటనతో సినిమాకు మరింత అందాన్ని జోడించారు. వీరిద్దరి మధ్య నలిగే సోగ్గాడి పాత్రను శోభన్ బాబు సమర్థవంతంగా పోషించారు.
Read also-Thaman Reply: థమన్ రెమ్యూనరేషన్ ఏం చేస్తారో తెలుసా.. ఆ సమయంలో అదే నడిపించింది..
ఈ సినిమా విజయానికి సంగీత దర్శకులు కె.వి. మహదేవన్ అందించిన అద్భుతమైన పాటలు ప్రధాన కారణం. పాటలు అప్పటికీ, ఇప్పటికీ జనాల నోళ్ళలో నానుతూనే ఉన్నాయి. ఈ పాటలు తెలుగు సినిమా పాటల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. దర్శకులు కె. బాపయ్య ఈ సినిమాను కుటుంబ విలువలు, ఆప్యాయత, అనుబంధాలు మరియు మనిషి మంచితనంపై దృష్టి పెట్టి అద్భుతంగా తెరకెక్కించారు. అందుకే ఈ సినిమా విడుదలైన యాభై ఏళ్ల తరువాత కూడా ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది. ఈ సినిమా చూసేందుకు సోబన్ బాబు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read also-Bandla Ganesh: ‘మోగ్లీ 2025’పై బండ్ల గణేష్ రివ్యూ.. ‘వైల్డ్’ అర్థమే మార్చేశారు
కొత్త తరం చూసే అవకాశం
నేటి తరం ప్రేక్షకులకు అప్పటి సినిమాల నిర్మాణ విలువలు, నటీనటుల సహజ నటన ఎంత గొప్పగా ఉండేవో పరిచయం చేయడానికి ఈ రీ-రిలీజ్ ఒక గొప్ప వేదిక కానుంది. ముఖ్యంగా డిజిటల్ ఫార్మాట్‌లో మరింత మెరుగైన క్వాలిటీతో ఈ క్లాసిక్‌ను వెండితెరపై వీక్షించడం సినీ అభిమానులకు పండుగే. డిసెంబర్ 19న థియేటర్లలో ‘సోగ్గాడు’ సందడి చేయబోతున్న సందర్భంగా, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, శోభన్ బాబు గారి అభిమానులు ఈ చిత్రాన్ని మరోసారి సగర్వంగా వీక్షించడానికి సిద్ధమవుతున్నారు. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ తెలుగు సినీ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలవనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదల చేశారు నిర్మాతలు.
On the occasion of completing 50 glorious years, the blockbuster evergreen classic #Soggadu, starring Nata Bhushana #SobhanBabu garu, is set to re-release in select cinemas on December 19th ✨#SoggaduReRelease Trailer Out Now:https://t.co/zpZ6K9DLaj#50GoldenYearsOfSoggadu… pic.twitter.com/6YgHrhprUM
— Suresh Productions (@SureshProdns) December 14, 2025

