Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ టెలివిజన్ నుంచి తెలుగు సినిమా స్టార్‌డమ్ వరకూ ఆమె సాధించిన ప్రయాణం సామాన్యమైనది కాదు. ఈ ఒడిదొడుకుల జర్నీలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, మానసిక సంఘర్షణలు ఆమెను ఒక్కసారి అగాధంలోకి నెట్టాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన గతంలోని ఎన్నో కష్టాలను గుర్తు చేసుకుంటూ, “ఒకానొక సమయంలో ఆత్మహత్యే దారని అనిపించింది” అని వెల్లడించారు. ఆ మాటలు అందరినీ కలచివేశాయి.
Also Read: SPDCL: విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నెంబర్‌లు.. ఎస్పీడీసీఎల్ కొత్త విధానం!
మృణాల్ ఠాకూర్ ఆత్మ హత్య చేసుకోవాలనుకుందా?
ఆమె మాట్లాడుతూ “కెరీర్ మొదట్లో అవకాశాలు లేక, మనసు కుంగిపోయింది. ముంబయి లోకల్ ట్రైన్ నుంచి దూకెయ్యాలనే ఆలోచన వచ్చింది. కానీ, ఆ క్షణంలో తల్లిదండ్రుల గుర్తొచ్చి ఆగిపోయాను. వారి కోసం బతకాలనుకున్నా ” అని మృణాల్ భావోద్వేగంతో చెప్పారు.
ఆమె మాట్లాడిన మాటలు ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తున్నాయి. అలాగే మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పిస్తున్నాయి.
‘సీతారామం’ తో భారీ ఫ్యాన్ బేస్
‘సీతారామం’ సినిమా ఆమె జీవితంలో ఒక మైలు రాయి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచి, మృణాల్‌కు భారీ ఫ్యాన్ బేస్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆమె వరుస సినిమా అవకాశాలతో బిజీ స్టార్‌గా మారారు. ప్రస్తుతం అడివి శేష్‌తో కలిసి ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తుంది.
Also Read: Viral Video: ఫ్లైఓవర్‌పై యువకుల చిల్లర చేష్టలు.. రెడ్ హ్యాండెండ్‌గా పోలీసుల డ్రోన్‌కు చిక్కి..!
మృణాల్ జీవితం ఒక స్ఫూర్తిదాయక కథ
మృణాల్ డిప్రెషన్‌ను అధిగమించి, ఆత్మహత్య ఆలోచనల నుంచి బయటపడిన తీరు మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన పెంచే సందేశంగా నిలుస్తోంది. ఆమె జీవితం కేవలం కెరీర్ విజయం గురించి మాత్రమే కాదు, అడుగడుగునా సవాళ్లను అధిగమించి, ధైర్యంగా ముందుకు సాగిన ఒక స్ఫూర్తిదాయక కథగా నిలిచింది.