Mrunal Thakur: మా అమ్మను కారులోనుంచి దింపేశారు..
Mrunal Thakur ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Mrunal Thakur: మా అమ్మను దారుణంగా అవమానించారు.. మృణాల్

Mrunal Thakur: ‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈ చిత్రంలో ‘సీత’గా కనిపించి అందరిని అలరించింది. ఈ మూవీలో ఆమె నటనకు వచ్చిన ప్రశంసలు, ప్రేక్షకుల అభిమానంతో మృణాల్ ఒక్కసారిగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారిపోయింది. సీరియల్స్ నుంచి సినిమాల వరకూ ప్రయాణించిన ఈ అమ్మడిని మొదట్లో చాలా మంది సీరియల్ ఫేస్ అంటూ తీసుకోవడానికి వెనుకాడినా… ఇప్పుడు స్టార్ హీరోలతో వరుసగా అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది.

ఇలా కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో, మృణాల్ తాజాగా ఒక ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది. కానీ ఇది కేవలం లగ్జరీ కోసం కాదు… ఆమె జీవితంలో చాలా లోతైన భావోద్వేగం దాగి ఉంది. ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేస్తూ షేర్ చేయడంతో అంతా షాక్ అయ్యారు.

Also Read: DK Shivakumar: సోనియానే అధికారాన్ని త్యజించారు.. సీఎం సిద్ధూ సమక్షంలోనే డీకే అసంతృప్తి.. ముదిరిన పోరు

తన చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్న మృణాల్ ఇలా పోస్ట్ లో రాసుకొచ్చింది..

“ నేను పేదరికంలో పుట్టాను. మా అమ్మ మమ్మల్ని పెంచడంలో ఎంత కష్టాలు పడిందో నాకు తెలుసు. బంధువులే మమ్మల్ని చిన్నచూపు చూశారు. మా అమ్మకు కారు ఎక్కే అర్హత లేదని చెప్పేవారు. ఒకసారి అమ్మని రోడ్డుమీద వదిలేసి వెళ్లిపోయిన సంఘటన నాకు మర్చిపోలేను. అప్పుడే డబ్బు సంపాదించాలని, అమ్మను ఖరీదైన కారులో తిప్పాలని నిర్ణయించుకున్నాను.” “ నేడు ఆ కల నెరవేరింది. మా అమ్మను అవమానించినవాళ్లలో ఎవరికీ లేని మెర్సిడెస్ బెంజ్ కారును ఆమె కోసం కొనుగోలు చేశాను.” అంటూ రాసుకొచ్చింది.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ” ప్రతి కన్న కూతురు వాళ్ళ అమ్మను ఇలాగే చూసుకోవాలి మృణాల్ బాగా చెప్పావ్ “, “నీ ప్రయత్నం నిజంగా అందరికీ ఇన్‌స్పిరేషన్” అంటూ నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: Bhagyashri Borse: సినిమా ప్రమోషనా? ప్రీ వెడ్డింగ్ షూటా?.. భాగ్యశ్రీ షేర్ చేసిన ఫొటోపై నెటిజన్ల కామెంట్స్ వైరల్!

ఇక సినిమాల విషయానికొస్తే.. మృణాల్ ప్రస్తుతం అడివి శేష్ హీరోగా రూపొందుతున్న ‘డెకాయిట్’ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. 2026లో విడుదల కానున్న ఈ చిత్రంతో పాటు ఆమె మరో రెండు బాలీవుడ్ ప్రాజెక్టులతో కూడా బిజీగా ఉంది.
మొత్తానికి , మృణాల్ ఠాకూర్ ఇప్పుడే కాదు.. మొదటి నుంచి సైలెంట్‌గా, స్ట్రాంగ్‌గా, తన కలల కోసం పట్టు విడవకుండా పరుగెడుతూ… ఇప్పుడు అదే ప్రయాణం కొనసాగిస్తూ అందరికీ ఇన్‌స్పిరేషన్‌గా మారిపోయింది.

Just In

01

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!

Jailer 2: ‘జైలర్ 2’లో గెస్ట్ రెల్ చేసేది బాలయ్య కాదట.. ఎవరంటే?

Bhartha Mahasayulaku Wignyapthi: కలర్‌ఫుల్‌గా ఫస్ట్ సింగిల్.. సాంగ్ ప్రోమో చూశారా?