Miracle: ‘మిరాకిల్’ మూవీ నుంచి సునీల్ తప్పుకున్నారు. సునీల్ (Sunil) స్థానంలో మరో హీరోకు ప్లేస్ కల్పించినట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ‘సత్యగ్యాంగ్, ఫైటర్ శివ’ చిత్రాల దర్శకుడు ప్రభాస్ నిమ్మల (Prabhas Nimmala) దర్శకత్వంలో శ్రీ విగ్నతేజ ఫిలిమ్స్, సైదా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రమేష్ ఎగ్గిడి, డీవోపీ సురేందర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘మిరాకిల్’ (Miracle). ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఈ నెల 21 నుంచి రెండో షెడ్యూల్ షూటింగ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో ప్రధాన హీరోగా రణధీర్ బీసు, మరో హీరోగా సునీల్ నటిస్తున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించి ఉన్నారు. అందుకు సునీల్ కూడా అంగీకరించడంతో మేకర్స్ పేరును ప్రకటించారు కూడా. కానీ, ఇప్పుడీ చిత్రం నుంచి సునీల్ తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అందు కారణం ఏంటంటే..
Also Read- Manchu Manoj: రాకింగ్ స్టార్ ప్రారంభించిన సంక్రాంతి పండుగ సంబరాల క్యాంపెయిన్ వివరాలివే..
సునీల్ ప్లేస్‌లో ఎవరంటే..
ఈ సినిమా షూటింగ్ టైమ్‌కి సునీల్‌కు స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చిందని, అందుకే చివరి నిముషంలో సునీల్ డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. సునీల్ ఈ మూవీ నుంచి తప్పుకోవడంతో, ఆయన స్థానంలో 90స్‌లో అలరించిన ‘రోజాపూలు’ ఫేం శ్రీరామ్ (Sriram)ను మరో హీరోగా తీసుకున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. శ్రీరామ్ ఈ చిత్రంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటించనున్నారు. అలాగే మరో పోలీస్ ఆఫీసర్‌గా అలనాటి హీరో సురేష్ కూడా ఇందులో నటిస్తున్నట్లుగా తెలుపుతూ ఆయన పోస్టర్‌ని కూడా నిర్మాతలు విడుదల చేశారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌లోకి శ్రీరామ్ ఎంటరవనున్నారని తెలుస్తోంది.

డేంజరస్ స్టంట్స్
ఇదిలావుండగా, ఈ చిత్ర మొదటి షెడ్యూల్ షూటింగ్‌లో డేంజరస్ స్టంట్స్‌ను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా రణధీర్ బీసు అనే యువకుడు హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర మొదటి షెడ్యూల్‌లో హీరోలు సురేష్ (Suresh), రణధీర్‌పై డేంజరస్ స్టంట్స్‌ను చిత్రీకరించినట్లుగా సమాచారం. మొదటి షెడ్యూల్ షూటింగ్‌తో సినిమాపై టీమ్‌కి ఉన్న నమ్మకం మరింతగా పెరిగిందని, దీంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తున్నట్లుగా చిత్రబృందం మాట్లాడుకుంటోంది. రెండో షెడ్యూల్‌లో హీరో శ్రీరామ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్‌గా హెబ్బాపటేల్ నటిస్తోంది. ఆమెతో పాటూ మరికొందరు సీనియర్ నటులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నట్లు దర్శకుడు ప్రభాస్ నిమ్మల తెలిపారు. మొదటి షెడ్యూల్ షూటింగ్‌లో వచ్చిన అవుట్‌ఫుట్‌లో చాలా హ్యాపీగా ఉన్నామని, ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు అందరినీ అలరిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

