Abhinav: ‘అభినవ్’కు మంత్రి కొండా సురేఖ సపోర్ట్
Abhinav Trailer Launch Event
ఎంటర్‌టైన్‌మెంట్

Abhinav: ‘అభినవ్’కు మంత్రి కొండా సురేఖ సపోర్ట్

Abhinav: శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిల్స్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్న బాలల చిత్రం ‘అభినవ్’. ‘చేజ్డ్ పద్మవ్యూహ’ (Abhinav – Chased Padma Vyuh) అనేది ట్యాగ్‌లైన్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడమే కాకుండా, అనేక ఫెస్టివల్స్‌లో ఎన్నో అవార్డులు సైతం ఈ సినిమాకు వచ్చాయి. తాజాగా ఈ చిత్ర పోస్టర్ మరియు చిత్ర ట్రైలర్‌ను తెలంగాణా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Telangana Minister Konda Surekha) ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ సినిమా నిర్మాణం జరుపుకోవడం అభినందనీయం. సమాజ శ్రేయస్సు కోసం, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ సినిమాను భీమగాని సుధాకర్ ( Dr Bhimagani Sudhakar Goud) నిర్మించినందుకు ఆయనని అభినందిస్తున్నాను. ఇలాంటి చిత్రాలకు ప్రభుత్వ సహకారం తప్పకుండా ఉంటుంది. ప్రస్తుతం డ్రగ్ మాఫియా విద్యార్థులను సైతం వదలడం లేదు. చిత్ర ట్రైలర్ ఎంతో స్ఫూర్తిగా ఉంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తూ, సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.

Also Read- Ketika Sharma: కేతికా.. నీ పంట పండిందిపో! ‘అది ధ సర్‌ప్రైజ్’

గంజాయి మాఫియా మరియు డ్రగ్ మాఫియా కబంధ హస్తాల్లో ఇరుక్కున్న గిరిజన అనాధ బాల కార్మికులను.. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్కూల్‌లో చదువుతున్న యోగ మరియు ఆర్మీ శిక్షణ తీసుకున్న విద్యార్థులు ఎలా రక్షించారు? గంజాయి మాఫియాను, డ్రగ్ మాఫియాను వారు ఎలా అంతం చేశారు? అనే కథాంశంతో ఈ సినిమాను రూపొందించామని అన్నారు దర్శక నిర్మాత భీమగాని సుధాకర్. బాలల చిత్రం అయినా యాక్షన్ సన్నివేశాలతో బలమైన కథాంశంతో, ఉత్కంఠ భరితంగా ఈ సినిమా ఉంటుందని, ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిదని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలాంటి చిత్రాలు చూపిస్తే, వారిలో ధైర్యం, నాలెడ్జ్ వస్తాయని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా నిర్మాణంలో తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సారధి స్టూడియో సహకారంతో ఈ సినిమాను పూర్తి చేశామని, వందేమాతరం శ్రీనివాస్ (Vandemataram Srinivas) సంగీతం, నందమూరి హరి (Nandamuri Hari) ఎడిటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు. అతి త్వరలో తెలంగాణ విద్యార్థుల కోసం ఈ సినిమాను నూన్ షో‌గా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా డా. భీమగాని సుధాకర్ గౌడ్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.  కాగా, ఈ సినిమాకు ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ప్రముఖులెందరో సపోర్ట్ అందించడం విశేషం. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ కూడా తన సపోర్ట్‌ని అందించి, సినిమా ప్రమోషన్స్‌కి సహకారం అందించారు.

ఇవి కూడా చదవండి:
Jyothika: ‘కంగువ’పై కామెంట్స్ చేశారు, కానీ కొన్ని చెత్త సినిమాలకు.. ఇచ్చిపడేసిన జ్యోతిక

SSMB29: అడ్డడ్డే.. రాజమౌళికి ఎంత కష్టం వచ్చింది.. ఇక టార్చరే!

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం