Megastar Chiranjeevi: నాని ‘ది ప్యారడైజ్’లో మెగాస్టార్.. నిజమేనా?
The Paradise Movie Update
ఎంటర్‌టైన్‌మెంట్

Megastar Chiranjeevi: నాని ‘ది ప్యారడైజ్’లో మెగాస్టార్.. శ్రీకాంత్ ఓదెల ఏం ప్లాన్ చేశావయ్యా!

Megastar Chiranjeevi: నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో ‘దసరా’ (Dasara) తర్వాత రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతూ, ఈ సినిమాను వార్తల్లో ఉండేలా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్.. ఇలా మొత్తంగా ఈ సినిమా ఎనిమిది భాషల్లో విడుదల కాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన తర్వాత, రీసెంట్‌గా హాలీవుడ్‌లోని ConnekktMobScene‌తో ఈ మూవీ టీమ్ కోలాబరేట్ అవుతున్నట్లుగా వచ్చిన వార్త అందరికీ షాక్ ఇచ్చింది. ఈ సినిమా నార్మల్‌గా ఉండదని, ఈసారి నాని ఇంటర్నేషనల్ రేంజ్‌కి వెళ్లబోతున్నాడంటూ వార్తలు మొదలయ్యాయి. ఈ వార్త ఇలా ఉండగానే, ఇప్పుడు మరో వార్త ఈ సినిమాను టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మార్చింది. ఆ వార్త ఏంటంటే..

Also Read- Sreeleela: ఏప్రిల్ తర్వాత ఏంటి? శ్రీలీలకు అది కూడా తెలియదా?

మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్

అవును.. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గెస్ట్ రోల్ చేయబోతున్నారట. ఇప్పుడిదే ఈ సినిమాను వార్తలలో హైలెట్ అయ్యేలా చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవికి ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వీరాభిమాని. ఆ విషయం ఇటీవల మెగాస్టార్ పుట్టినరోజున విషెస్ తెలుపుతూ ఆయన చేసిన పోస్టే చెబుతోంది. ‘ది ప్యారడైజ్’ తర్వాత మెగాస్టార్ చిరంజీవితోనే శ్రీకాంత్ ఓదెల సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను నేచురల్ స్టార్ నానినే నిర్మించనున్నారు. ఇది అధికారికంగా తెలిసిన విషయమే. కానీ, అప్పటి వరకు శ్రీకాంత్ ఓదెల వెయిట్ చేయలేకపోతున్నట్లున్నాడు. ‘ది ప్యారడైజ్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ అద్భుతమైన సీక్వెన్స్ రెడీ చేశాడని, అది చిరంజీవికి వినిపించేందుకు టీమ్ రెడీ అవుతోందని టాలీవుడ్ సర్కిల్స్‌లో రెండు రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజం అనేది మాత్రం తెలియాల్సి ఉంది. నిజంగా టీమ్ కనుక మెగాస్టార్‌ని మీట్ అయితే మాత్రం.. కచ్చితంగా చిరు గెస్ట్ రోల్ ఇందులో ఉంటుందని ఫిక్సయిపోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో..

ఇంతకు ముందు చిరు గెస్ట్ రోల్ చేసిన సినిమాలు..

ఇంతకు ముందు కూడా చిరంజీవి కొన్ని సినిమాలలో గెస్ట్ రోల్‌లో కనిపించారు. చిరంజీవి గెస్ట్ రోల్‌గా చేసిన సినిమాల విషయానికి వస్తే.. ‘స్టైల్, మగధీర, బ్రూస్‌లీ’ సినిమాలు అందరికీ తెలుసు. ఇవి కాకుండా, ‘త్రిమూర్తులు, మా పిళ్లై, సిపాయి’ వంటి సినిమాలతో పాటు జయసుధ నిర్మించిన నాగబాబు సినిమా ‘హేండ్సప్’లోనూ ఆయన స్పెషల్ అప్పీరియెన్స్ ఇచ్చారు. ఇవి కాకుండా పాత సినిమాలు కొన్నింటిలో కూడా ఆయన గెస్ట్ పాత్రలో కనిపించారు.

Also Read- Niharika Konidela: సారీ అమ్మా! అంటూ నిహారిక పోస్ట్.. అల్లు శిరీష్ కామెంట్ వైరల్!

మన శంకర వరప్రసాద్ గారు‌తో బిజీ

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను రాబోయే సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ దిశగానే షూటింగ్‌ను శరవేగంగా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెలతో, అలాగే ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీతో సినిమాలను మెగాస్టార్ కమిట్ అయ్యారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు