Chiranjeevi (Image Source; X)
ఎంటర్‌టైన్మెంట్

Megastar Chiranjeevi: 70 ఏళ్ల వయసులో అవసరమా? అనే వాళ్లకి ఇదే సమాధానం!

Megastar Chiranjeevi: ‘70 ఏళ్లు వచ్చాయి, ఈ వయసులో ఇలాంటి సినిమాలు, పాటలు ఎందుకు?’ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న విమర్శకులకు తనదైన శైలిలో దీటైన జవాబిచ్చారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). తాజాగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ విడుదలతో, చిరంజీవి మరోసారి తన వయసును కాదు, తన డెడికేషన్‌ను, గ్రేస్‌ను చూడాలని స్పష్టం చేశారు.

ట్రేడ్‌మార్క్ డ్యాన్స్‌తో అదరగొట్టిన చిరు

70 సంవత్సరాల వయసులో కూడా చిరంజీవి చూపించిన గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నాయి. ‘మీసాల పిల్ల’ అంటూ నయనతారను టీజ్ చేస్తూ సాగే ఈ రొమాంటిక్ డ్యాన్స్ నంబర్‌లో, చిరంజీవి ట్రేడ్‌మార్క్ స్టైల్, ఎనర్జిటిక్ స్టెప్పులు వింటేజ్ వైబ్స్‌ను గుర్తు చేశాయి. ముఖ్యంగా, స్టైలిష్ సూట్‌లో ఆయన కనిపించిన తీరు, డ్యాన్స్ చేసిన విధానం.. తనపై వస్తున్న వయసు విమర్శలకు గట్టి కౌంటర్‌గా నిలిచింది. ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు కావలసిన డ్యాన్స్, చార్మ్‌ను మెగాస్టార్ ఏ మాత్రం తగ్గకుండా పలికించారు.

Also Read- Siddu Jonnalagadda: ఎప్పుడైనా ఒకమ్మాయి మీ మనసు విరగ్గొట్టి వెళ్లిపోతే.. వెళ్లిపోనివ్వండి! మర్యాద పోగొట్టుకోకండి

ఉదిత్ నారాయణ్ గాత్రం

భార్యాభర్తల మధ్య సరదా టీజింగ్, అలకలు, బతిమాలుకోవడాల నేపథ్యంలో సాగే ఈ పాటకు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మంచి మెలోడీ ట్యూన్ అందించారు. ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది సీనియర్ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్ గాత్రం. చాలా కాలం తర్వాత చిరంజీవికి ఉదిత్ నారాయణ్ పాడటం, శ్వేతా మోహన్ వాయిస్‌తో కలిసి అదిరిపోయే కెమిస్ట్రీని సృష్టించింది. భాస్కర భట్ల రవికుమార్ అందించిన సరదా సాహిత్యం, విజయ్ పొలాకి కొరియోగ్రఫీ ఈ పాటను చార్ట్‌బస్టర్‌గా నిలబెట్టాయి. పాట విడుదలకు ముందు వచ్చిన ప్రోమోనే సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపింది.

Also Read- Gopi Galla Goa Trip Trailer: గోవాలో ఏది బడితే అది చేయవచ్చంట.. ఈ ట్రైలర్ ఏందిరా బాబు ఇలా ఉంది?

అభిమానులకు పండుగ, ట్రోలర్స్‌కు సమాధానం

‘మీసాల పిల్ల’ సాంగ్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో ఫుల్‌గా ట్రెండ్ అవుతోంది. ఈ పాట కేవలం అభిమానులకు విజువల్ ట్రీట్‌గా నిలవడమే కాకుండా, సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఈ పాటతో చిరంజీవి.. పని పట్ల ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తూ.. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని మరోసారి నిరూపించారు. ‘మన శంకరవరప్రసాద్ గారు’ సంక్రాంతి 2026 కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ పాట విజయం సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచి, మెగాస్టార్ దూకుడుకు అద్దం పడుతోంది. ముఖ్యంగా ఆయనపై కామెంట్ చేయడానికి ఆస్కారం లేకుండా చేసిందనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి తనలోని మాస్‌లో మరోసారి బయటకు తీయబోతోన్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెలతో పాటు, బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలు రెండూ కూడా చిరంజీవిలోని మాస్ పవర్‌ని తెలియజేసేలా ఉంటాయనేలా టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..