Gopi Galla Goa Trip Trailer: రాస్తా ఫిల్మ్స్, ఔరాఉలిస్ ఆర్ట్స్, అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్, అవంతి సినిమా సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘గోపి గాళ్ల గోవా ట్రిప్’ (Gopi Galla Goa Trip). అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, పవోన్ రమేష్, మోనిక బుసం వంటి వారు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాను సాయి కుమార్, సీతా రామరాజు, రమణా రెడ్డి నిర్మించారు. రోహిత్ అండ్ శశి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి సాయి రాజేష్ (Sai Rajesh), వెంకటేష్ మహా (Venkatesh Maha), రూపక్ (Rupak) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గోవా ట్రిప్‌ని బేస్ చేసుకుని రూపొందిన ఈ చిత్రం ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో వస్తున్నట్లుగా ట్రైలర్ తెలియజేస్తుంది.
Also Read- Tollywood Heroines: బాలీవుడ్ అంటూ.. ఈ హీరోయిన్స్ తప్పు చేస్తున్నారా?
ఏది బడితే అది చేయవచ్చంట
ట్రైలర్‌ని గమనిస్తే.. ‘అసలు ఏమైంది’ అని ఓ పర్సన్ అడుగుతుంటే.. అతనికి ఎదురుగా కూర్చున్న వాళ్లు ఇన్నోసెంట్ ఫేస్‌లు పెట్టి.. ‘ఏం చెప్పమంటావ్ అన్నా?’ అని అంటున్న డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. జరిగింది చెప్పమని అడిగితే.. ‘మాది గోపాలపురం అన్న.. మా ఊరిలో గోపన్న అని ఒక అన్న ఉన్నాడు. ఆయన గోవా గురించి చెప్పాడు. అక్కడికి వెళితే.. అది చేయవచ్చు, ఇది చేయవచ్చు అని ఘోరంగా చెప్పాడన్నా. అందుకని పైసలన్నీ తీసుకుని వచ్చామన్నా. ఈడకి వస్తే ఏం అవుతలే అన్నా..’ అని ఇద్దరూ సమాధానం ఇచ్చారు. ‘దేని కోసం వచ్చారు?’ అని మళ్లీ ప్రశ్న ఎదురవడంతో.. ‘గోపన్న చెప్పిండు.. గర్ల్ ఫ్రెండ్ ఎక్స్‌పీరియెన్స్ అంట. ఒక రోజంతా మనతోటే ఉంటారంట. ఏది బడితే అది చేయవచ్చంట..’ అని చెప్పగానే.. మరి ఏమైంది? అని మరో ప్రశ్న. అలా ప్రశ్న, సమాధానాలతో నడుస్తున్న ఈ ట్రైలర్‌లో ‘గోవా అంటే తెల్లోళ్లు, నల్లోళ్లు కాదు.. గోవా అంటే హెవెన్’ అని వివరణ ఇవ్వడం, మధ్యలో వచ్చే సన్నివేశాలు, డైలాగ్స్ అన్నీ కూడా యూత్‌ని బేస్ చేసుకుని రూపుదిద్దుకున్న చిత్రమిదని ఓ క్లారిటీ వస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరూ.. ఈ ట్రైలర్ ఏందిరా బాబు.. ఇలా ఉంది? అని అనకుండా ఉండలేరు.

Also Read- Telugu Indian Idol S4: షోకి గెస్ట్‌గా పిలిచి.. బ్రహ్మానందాన్ని అలా ఏడిపించారేంట్రా? ప్రోమో వైరల్
యూనిక్ కాన్సెప్ట్
ఇక ఈ ట్రైలర్ విడుదల అనంతరం సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘రోహిత్, శశి.. ఇద్దరూ మంచి ఫిల్మ్ మేకర్స్. వాళ్లు సినిమాను తీసిన తీరు చూసి నాకు మైండ్ బ్లాక్ అయింది. ఈ చిత్రానికి ఎలాంటి సహాయమైనా సరే చేసేందుకు నేను రెడీ. ఇలాంటి సినిమాకు మీడియా కచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ చిత్రాలను అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. ఎప్పటికైనా సరే.. రోహిత్ అండ్ శశి పేరు చాలా స్ట్రాంగ్‌గా వినిపిస్తుందని నేను నమ్ముతున్నానని అన్నారు. వెంకటేష్ మహా మాట్లాడుతూ.. రోహిత్ అండ్ శశి నాకు ఎప్పటి నుంచో తెలుసు. నేను వాళ్లని మొదటిసారి గోవాలోనే కలిశాను. ఈ టైటిల్ వినగానే నాకు ఆ రోజులే గుర్తుకు వచ్చాయి. ఈ ట్రైలర్ చూస్తుంటే.. నాకు అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ మేకర్స్ తీసినట్టుగా అనిపించింది. వారికి మంచి పేరు, డబ్బులు రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. చిత్ర దర్శకులు రోహిత్ అండ్ శశి (Rohit and Sasi) మాట్లాడుతూ.. వచ్చిన గెస్ట్‌లకు ధన్యవాదాలు చెప్పారు. ఇదొక రోడ్ ట్రావెల్ ఫిల్మ్ అని, నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారని, మాలాంటి కొత్తవాళ్లని, చిన్న చిత్రాల్ని.. మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ చేయాలని కోరారు. ఇంకా పలువురు ప్రముఖులు మాట్లాడారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
