Telugu Indian Idol S4: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4కు గెస్ట్‌గా వచ్చిన బ్రహ్మానందాన్ని (Brahmanandam) ఏడిపించేశారు. మాములుగా కాదు.. ఇంత వరకు ఆయన అలా ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోలేదు. అలా ఏడిపించేశారు. ఇంతకీ ఆయన అంతగా ఎమోషనల్ అవడానికి కారణం.. అక్కడ సింగర్స్ పాడిన పాటలైతే కానే కాదు. మరి ఏంటో తెలియాలంటే పూర్తి కథనం చదవాల్సిందే. తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’.. ‘తెలుగు ఇండియన్ ఐడల్’ (Telugu Indian Idol)ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ మ్యూజికల్ రియాలిటీ షో.. సీజన్ 4కు చేరుకుంది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్.. స్టార్ సింగర్స్ కార్తీక్, గీతా మాధురి జడ్జిలుగా సక్సెస్‌పుల్‌గా రన్ అవుతున్న ఈ షోకు ప్రతి వారం ఎవరో ఒకరు గెస్ట్‌గా వస్తున్నారు. అక్టోబర్ 17న జరిగే ఎపిసోడ్‌కు సంబంధించి హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోని తాజాగా ఆహా టీమ్ విడుదల చేసింది. ఈ ప్రోమోని గమనిస్తే..
Also Read- Dammu Srija: వాడు, వీడు అంటూ నాగ్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన శ్రీజ.. వీడియో వైరల్!
గెస్ట్‌గా కిల్ బిల్ పాండే
ఈ షోని హోస్ట్ చేస్తున్న సింగర్స్ శ్రీరామచంద్ర, సమీరా భరద్వాజ్.. ‘వైల్డ్ కార్డ్ ఎంట్రీ’ అని బిగ్గరగా అనౌన్స్ చేయగానే.. కామెడీ కింగ్ బ్రహ్మానందం తనదైన స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని బ్రహ్మానందం రావడంతో.. కంటెస్టెంట్స్ అందరూ ఆశ్చర్యపోయారు. కిల్ బిల్ పాండే అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ వస్తుంటే.. బ్రహ్మి ఎంట్రీ అదిరిపోయింది. ‘మీరొచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్.. అల్లాడిపోతున్నాను సార్’ అని సమీరా భరద్వాజ్ అనగానే బ్రహ్మి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఉంది చూశారూ? అది చెప్పేకంటే చూస్తేనే బాగుంటుంది. వెంటనే కంటెస్టెంట్స్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన బ్రహ్మి.. షో మొదలయ్యేలా చేశారు.
Also Read- Ilaiyaraaja: ఇళయరాజా స్టూడియోలో బాంబు.. మరోసారి తమిళనాడులో బాంబు బెదిరింపుల కలకలం!
అలా ఏడిపించేశారేంటి?
పవన్ కళ్యాణ్ ‘ఐ లవ్ యూ అంటే.. ఛీ కొట్టి పోతావ్’ అనే పాటను ఆలపించగా.. గీతా మాధురి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఒరిజినల్‌ను మరిచిపోయేలా మంచి హై ఇచ్చావంటూ సింగర్‌పై ప్రశంసలు కురిపించారు. వెంటనే థమన్ స్పందిస్తూ.. చాలా కష్టం బ్రో ఈ పాటను పాడటం.. నువ్వు సునాయాసంగా పాడేశావ్ అని అభినందించారు. ఇక వరుసగా ‘హే నాయక్’, ‘గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా’, ‘నరుడా ఓ నరుడా ఏమి కోరిక’, ‘చెప్పమ్మా చెప్పమ్మా’ వంటి పాటలను కంటెస్టెంట్స్ అలపించారు. అనంతరం బ్రహ్మిపై ప్రత్యేకంగా కొన్ని పాటలను సింగర్స్ అందరూ కలిసి పాడారు. ‘నన్ను ఎందుకు ఇలా టార్గెట్ చేశారో నాకు అర్థం కావడం లేదు’ అంటూ పంచ్ పేల్చారు. అనంతరం శ్రీరామచంద్ర వచ్చి.. ‘బ్రహ్మానందం సార్.. మీకు, ఎస్‌పి బాలుగారికి ఉన్న చిన్న ఎక్స్‌పీరియెన్స్ ఉంటే ఏదైనా చెప్పండి’ అని అడగగానే.. ‘చిన్న అనుబంధమేమీ కాదు.. పెద్దదే. కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్నటువంటి మనిషి, మంచి మనిషి. ఆయన..’ అంటూ మరో మాట మాట్లాడలేని విధంగా బ్రహ్మానందం ఎమోషనల్ అయ్యారు. బ్రహ్మీ ఒక్కరే కాదు.. అక్కడున్న వాళ్లంతా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో బాగా వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ అక్టోబర్ 17వ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రసారం కానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

