Siddu Jonnalagadda (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Siddu Jonnalagadda: ఎప్పుడైనా ఒకమ్మాయి మీ మనసు విరగ్గొట్టి వెళ్లిపోతే.. వెళ్లిపోనివ్వండి! మర్యాద పోగొట్టుకోకండి

Siddu Jonnalagadda: ‘మిరాయ్’ పాన్ ఇండియా సక్సెస్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘తెలుసు కదా’ (Telusu Kada). స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో స్టైలిస్ట్ నీరజా కోన (Neeraja Kona) దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. అక్టోబర్ 17న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

Also Read- Priyadarshi: ‘మిత్ర మండలి’పై నెగెటివ్ క్యాంపైన్.. ప్రియదర్శి ఎలా స్పందించారంటే?

అమ్మాయిలే గొప్ప

ఈ ప్రీ రిలీజ్ వేడుకలో హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు నాకు బాధగా ఉంది. ఒక ఏడాదిగా రాడికల్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ప్లే చేస్తూ వచ్చాను. ఒక వింత మనిషి నా బుర్రలో బతుకుతున్నాడు. ఎల్లుండి సినిమా రిలీజ్ కాబోతుంది. వరుణ్ అనే పాత్రకి గుడ్ బై చెప్పేయాలి. నేను ఎందుకు ఆ క్యారెక్టర్ గురించి ఇంత ఇదిగా చెప్తున్నానంటే.. సినిమా చూస్తున్నప్పుడు మీకే అర్థం అవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. అందుకే లాస్ట్ టైమ్ ఈ స్టేజ్‌పై వరుణ్ లాగా ఉందామనుకుంటున్నాను. వరుణ్ నాకు రెండు కండీషన్స్ పెట్టాడు. ఇక్కడున్న ఆడపిల్లలు అందరితో మాట్లాడమని చెప్పాడు. అమ్మాయిలతోనే ఈ సృష్టి మొదలైంది. మేము మీ ముందు చాలా నిమిత్త మాత్రులం. మేము ఏదైనా చిన్న తప్పు చేసినా మీరు పెద్దమనసు చేసుకుని క్షమించేయాలి. మీరు గొప్పా, మేము గొప్పా అనే డిస్కషన్ లేదు. మీరే గొప్ప. మీ వల్లే మేము గొప్ప.

Also Read- Tollywood Heroines: బాలీవుడ్ అంటూ.. ఈ హీరోయిన్స్ తప్పు చేస్తున్నారా?

సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడూ అక్కడుండాలి

ఇప్పుడు బాయ్స్‌తో మాట్లాడదాం. ఎప్పుడైనా ఒకమ్మాయి మీ మనసు విరగ్గొట్టి వెళ్లిపోతే.. వెళ్లిపోనివ్వండి. లేదు, అలా కాదు అని ఆమె వెంట పడ్డారో.. ఎంత వెంట పడతారో.. అంత మీకు మీ మీద ఉన్న మర్యాద పోతుంది. అబ్బాయిలకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడూ ఎవరెస్ట్ అంత హైట్‌లో ఉండాలి. ఆ తర్వాత మనసు విరుగుతుంది, బాధేస్తుంది, ఏడుస్తాం.. ఎందుకురా ఇలా ఇరుక్కుపోయామనే ఒక ఫీలింగ్ వస్తుంది.. రానివ్వండి పర్లేదు.. అసలు కథ అక్కడే మొదలవుతుంది. అప్పుడు వరుణ్ లాంటివాడు ఒకడు మీలో నుంచి బయటకు వస్తాడు. అప్పుడు మనకి అర్థమవుతుంది.. మన ఎమోషన్స్ ఎప్పుడూ మన కంట్రోల్‌లో ఉండాలని. పవర్ సెంటర్ ఎప్పుడూ మనసులో మెయింటైన్ అవ్వాలి. ఇంకేమైనా డౌట్లు మిగిలిపోయి ఉంటే అక్టోబర్ 17న థియేటర్స్‌కి వచ్చి ‘తెలుసు కదా’ సినిమా చూడండి. ఈ సినిమాలో వరుణ్ అనే పాత్ర ఒక్క చుక్క రక్తం చిందించకుండా.. ఎమోషనల్ వార్, సైకలాజికల్ వైలెన్స్‌ని జనరేట్ చేస్తాడు. అది నా ప్రామిస్. బెర్ముడా ట్రయాంగిల్ మీద నుంచి షిప్ వెళ్లినా, ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళినా దానిలోకి లాగేసుకుంటుంది. ‘తెలుసు కదా’ కూడా అలాంటి లవ్ ట్రయాంగిల్. ఈ సినిమా చూసిన వాళ్ళందరినీ కూడా అది లాగేస్తుంది. వరుణ్ పాత్రకి గుడ్ బై చెప్పడం నిజంగా బాధగా ఉంది. ఈ పండక్కి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రియదర్శి ‘మిత్రమండలి’, కిరణ్ అబ్బవరం ‘కే ర్యాంప్’, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’, సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’. అన్ని మంచి సినిమాలుగా విన్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?