Mega vs Allu: కొన్నాళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా వర్సెస్ అల్లు అనేలా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలియంది కాదు. ముఖ్యంగా అల్లు అర్జున్.. మెగా ట్యాగ్ వదిలి వేరు కుంపటి పెట్టిన విషయం, ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎవరిని అడిగినా చెబుతారు. అలాగే ఇన్నాళ్లు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వెనుక ఉన్న అల్లు అరవింద్, ఇప్పుడు రూటు మార్చి తన ‘అల్లు’ని అగ్రస్థానానికి చేర్చాలని తెగ తాపత్రయ పడుతున్నట్లుగా ఆయన వేసే ప్రతి అడుగు తెలియజేస్తుంది. తన కుమారుడు అల్లు అర్జున్ (Allu Arjun) వెనుక అదృశ్య శక్తిగా అల్లు అరవింద్ పావులు కదుపుతున్నారనే విషయాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం గ్రహిస్తూనే ఉంది.
అల్లు అరవింద్ మాస్టర్ మైండ్‌తోనే అల్లు అర్జున్ ప్రస్తుతం రేంజ్ పెరిగిందనేలా వాదన చాలా గట్టిగా వినిపిస్తుంది. ఒకడ్ని లేపాలంటే, ఇంకొకడ్ని తొక్కాలనే సిద్ధాంతం అల్లు అరవింద్ పాటిస్తున్నాడా? మరీ ముఖ్యంగా మెగాని పైకి రానివ్వకుండా, రేసులో నిలబడనీయకుండా చేయాలని.. అలా చేస్తేనే ‘అల్లు’కి అగ్రపీఠం వరిస్తుందని భావిస్తున్నాడా? అంటే ఏమో చెప్పలేం కానీ, పరిస్థితులు మాత్రం అలానే కనిపిస్తున్నాయి.
Also Read- Nidhhi Agerwal: పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమా చేస్తే.. వేరేవి వంద సినిమాలు చేసినట్లే!
ఇండస్ట్రీలో అల్లు అరవింద్ (Allu Aravind) చెప్పిన మాటని నిర్మాతలు చాలా మంది వింటారు. దిల్ రాజు (Dil Raju) అయితే శిరసా వహిస్తాడు. సంక్రాంతికి వచ్చిన ‘గేమ్ చేంజర్’ (Game Changer) విషయంలో దిల్ రాజు చాలా దారుణంగా వ్యవహరించారు. సరైన ప్రమోషన్స్ కూడా ఆ సినిమాకు చేయలేదు. ఒకటి, రెండు ఈవెంట్స్ చేసి.. సినిమా విడుదల తర్వాత అసలు పట్టించుకోలేదు. ఇటీవల ‘తమ్ముడు’ సినిమా ప్రమోషన్స్‌లో రామ్ చరణ్ పేరుని ఎంత నెగిటివ్‌గా వాడారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
దీనంతటికీ కారణం ఏమై ఉంటుంది అంటే మాత్రం.. సరైన సమాధానం ఇప్పుడు రాకపోవచ్చు. సరే ఆ విషయం పక్కన పెడదాం. ఇటీవల ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదల అని ప్రకటన వచ్చిన తర్వాత థియేటర్ల బంద్ అంటూ ఎలా హడావుడి చేశారో అంతా చూస్తూనే ఉన్నారు. అప్పుడు కూడా ఇండస్ట్రీ పెద్దగా అల్లు అరవింద్ అందరినీ కలుపుకుని వచ్చి ఖండించకుండా.. తన తప్పేం లేదనేలా ప్రొజక్ట్ చేసుకోవడానికే ప్రయత్నించారు.
Also Read- Genelia: నా భర్త అలాంటి వాడే.. నన్ను చాలా టార్చర్ చేశాడు.. జెనీలియా సంచలన కామెంట్స్
‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా వస్తుంటే, థియేటర్లు బంద్ అని పిలుపునివ్వడం చాలా రాంగ్ అంటూ బీరాలు పోయిన అల్లు అరవింద్.. ఇప్పుడా సినిమాకు పోటీగా మరో సినిమాను దింపుతూ.. మరోసారి తన బుద్ధిని ప్రదర్శించాడంటూ మెగాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం విశేషం. నిజంగా పవన్ కళ్యాణ్ అంటే అంత ప్రేమ ఉన్నవాళ్లు.. ఆయన సినిమాకు పోటీగా సినిమా దించాలని అనుకోరు. అందులోనూ కొన్ని నెలలుగా కుటుంబ గొడవలు నడుస్తున్నాయనే అనుమానాలు ఉన్నప్పుడు అస్సలు అలాంటి పని చేయకూడదు.
మరి కావాలని చేస్తున్నారో, లేదంటే యాదృచ్చికంగా జరుగుతుందో తెలియదు కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి పోటీగా ఓ కన్నడ సినిమాను అల్లు అరవింద్ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘మహావతార్ నరసింహ’ (Mahavatar Narasimha) అనే సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదలైన మరుసటి రోజే ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. నిజంగా ఇది సాహసమనే చెప్పుకోవాలి. దీనిని చూపిస్తూ.. మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అల్లు అరవింద్‌ని ట్రోల్ చేస్తున్నారు. మెగా వర్సెస్ అల్లు నిజమే అని వారంతా భావిస్తున్నారు. చూద్దాం.. ఈ ఇష్యూ ఎంత వరకు దారి తీస్తుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు