Genelia ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Genelia: నా భ‌ర్త అలాంటి వాడే.. నన్ను చాలా టార్చ‌ర్ చేశాడు.. జెనీలియా సంచలన కామెంట్స్

Genelia: స్టార్ హీరోయిన్ జెనీలియా గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన అవసరం లేదు. బొమ్మరిల్లులోని హాసిని పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. అయితే, ఈ ముద్దుగుమ్మ 13 ఏళ్ల తర్వాత తిరిగి సినీ రంగంలోకి మళ్లీ అడుగుపెడుతోంది. ఈ నెల 18న విడుదలవుతున్న ‘జూనియర్’ చిత్రంతో ఆమె పూర్తి స్థాయి కమర్షియల్ రీ-ఎంట్రీ ఇస్తోంది.

Also Read: Gold Rates Down: ఎగిరిగంతేసే గుడ్ న్యూస్.. త్వరలో రూ.30,000 వేల వరకు తగ్గనున్న గోల్డ్ రేట్స్..?

ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ, తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. “నా రీ-ఎంట్రీ ఇప్పుడు కాదు, 2022లోనే నా భర్త రితేష్ దేశ్‌ముఖ్ డైరక్షన్ లో వచ్చిన ‘మజిలీ’ మరాఠీ రీమేక్‌లో సమంత పాత్రలో నటించాను. కానీ, ‘జూనియర్’తో ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాలోకి తిరిగి వస్తున్నాను” అంటూ జెనీలియా తెలిపింది. సినిమాలు తన జీవితంలో ముఖ్యమైనవే అయినప్పటికీ, కుటుంబం కూడా అంతే ముఖ్యం అని చెప్పుకొచ్చింది. గత 13 ఏళ్లలో భర్త రితేష్, పిల్లలతో సంతోషకరమైన జీవితం గడిపానని ఆమె తెలిపింది. “ఇప్పుడు పిల్లలు స్వతంత్రంగా వారి పనులు వారు చేసుకుంటున్నారు, అందుకే మళ్లీ కెమెరా ముందుకి వచ్చాను” అని చెప్పింది.

Also Read: Immunity Boosting Tips: శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే 7 చిట్కాలు.. ఇవి పాటిస్తే డాక్టర్‌తో పని లేనట్లే!

ఇంకా ఆమె మాట్లాడుతూ, “ మా ఆయన రితేష్ గత మూడేళ్లుగా నన్ను రీ-ఎంట్రీ ఇవ్వమని చాలా టార్చర్ చేశాడు. అందుకే ఈ సారి సౌత్ ఇండస్ట్రీలోకి వచ్చాను” అని నవ్వుతూ  చెప్పింది. తెలుగు ఆడియెన్స్ కు  తాను ‘జెనీలియా’గా కాకుండా ‘హాసిని’గానే గుర్తుండిపోయానని, ‘బొమ్మరిల్లు’ చిత్రంలో హాసిని పాత్ర తన కెరీర్‌ను మలుపు తిప్పినట్లు తెలిపింది. “‘బాయ్స్’లో హరిణి, ‘ఢీ’లో పూజ, ‘రెడీ’లో పూజాగా నటించాను, కానీ హాసిని పాత్రే నన్ను అందరి గుండెల్లో నిలిపింది. ” అని ఆమె తెలిపింది.

Also Read: Telangana: ప్రైవేటుతో ఎలక్ట్రిక్ బస్సుల ఒప్పందం రద్దు చేసుకోవాలి.. సీఎంకు ఆర్టీసీ ఎంప్లాయిస్ లేఖ

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!