Chiranjeevi and Nayanthara
ఎంటర్‌టైన్మెంట్

Mana Shankara Varaprasad Garu: ‘మీసాల పిల్ల’ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. ఎలా మెగాస్టార్ ఇలా?

Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu). కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి అపజయమనేది లేకుండా వరుస హిట్స్‌తో సంచలనాలను క్రియేట్ చేస్తున్న అనిల్ రావిపూడి, ఫస్ట్ టైమ్ మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు. దీంతో ఈ సినిమా కోసం ఆయన చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రమోషన్స్ పరంగా మరోసారి తన స్ట్రాటజీని కనబరుస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు చిరంజీవి ఓకే చేసిన ‘విశ్వంభర’ గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు కానీ, ‘మన శంకరవరప్రసాద్ గారు’ మాత్రం ఎప్పుడూ వార్తలలో నిలుస్తూనే ఉన్నారంటే అనిల్ రావిపూడి మ్యాజిక్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక విజయ దశమిని పురస్కరించుకుని ఈ సినిమా అప్డేట్స్‌ని వదులుతామని చెప్పిన మేకర్స్.. చెప్పినట్లుగానే శశిరేఖగా ఇందులో నయనతార (Nayanthara) పాత్రను పరిచయం చేశారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమోని మేకర్స్ వదిలారు. ఈ ప్రోమో విషయానికి వస్తే..

Also Read- Rahul Ramakrishna: కేసీఆర్, కేటీఆర్.. కలకలం రేపుతోన్న రాహుల్ రామకృష్ణ ట్వీట్స్!

అప్పుడు రమణ గోగుల.. ఇప్పడు ఉదిత్ నారాయణ్

శశిరేఖగా ది మాగ్నిఫిసెంట్ నయనతారను పరిచయం చేసిన తర్వాత.. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా? అని మెగా ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్న క్రమంలో.. టీమ్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఈ ప్రోమో కంటే ముందు.. ప్రోమో వస్తున్నట్లుగా తెలిపేందుకు అనిల్ రావిపూడి చేసిన సరదా వీడియో.. ఈ సాంగ్ ప్రోమో కోసం వేచి చూసేలా చేసింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘గోదారి గట్టు మీద’ పాట కోసం రమణ గోగులను తీసుకొచ్చిన అనిల్ రావిపూడి.. ఇప్పుడు చిరు సినిమా కోసం.. ఏకంగా ఉదిత్ నారాయణ్‌ను తీసుకొచ్చారు. చిరంజీవి సినీ కెరీర్‌లో ఉదిత్ నారాయణ్ పాడిన పాటలన్నీ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. అదే మ్యాజిక్‌ని క్రియేట్ చేయడానికి మరోసారి ఆయనతో ఈ పాటను పాడించినట్లుగా చెప్పడానికి చేసిన సరదా వీడియో బాగా వైరలైంది. ఈ వీడియో చూసిన వారంతా.. నీ ప్రమోషన్స్ స్ట్రాటజీకి టేక్ ఏ బౌ అంటూ అందరూ అనిల్‌ని ఉద్దేశించి కామెంట్స్ చేయడం విశేషం. ఇక పాట విషయానికి వస్తే.. చిరు, నయనతారల వాయిస్‌తో, చిన్నపాటి ఫైట్‌తో మొదలైన ఈ సాంగ్.. ఉదిత్ నారాయణ్ వాయిస్ వినగానే సరికొత్త ఫీల్‌ని తెప్పిచింది. ఇక డ్యాన్స్ గ్రేస్ అంటే గుర్తొచ్చే పేరు చిరంజీవి. ‘మీసాల పిల్ల’ (Meesala Pilla Song) అంటూ వచ్చిన ఈ ప్రోమోలో మరోసారి చిరు తన మెగా గ్రేస్‌ని ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది. ‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్‌ని త్వరలోనే విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.

Also Read- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘పురుష:’ ఎంత వరకు వచ్చిందంటే..

ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే

ఇక ఈ ప్రోమోలో మెగాస్టార్ డ్యాన్స్ స్టెప్స్ చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఆయనకు ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే అని అంతా మరోసారి ముక్తకంఠంతో చెబుతున్నారు. అసలు ఇలా ఎలా చిరు? అంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే.. ఇది కదా మెగాస్టార్ అని ఫ్యాన్స్ కాలర్స్ ఎగరేస్తున్నారు. ఇక ఇందులో చిరు అభినయం చూశాక వింటేజ్ చిరు కమ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ దసరాకు అద్భుతమైన ట్రీట్ ఇచ్చావంటూ అనిల్ రావిపూడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పణలో.. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాప్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bad Boy Karthik: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’.. అమెరికా నుండి వచ్చిన ఐటమ్ అదిరింది

Elon Musk: సంపద విషయంలో ఎలాన్ మస్క్ అరుదైన ఘనత.. ఈ భూమ్మీద తొలి వ్యక్తి ఆయనే

Woman Found Alive: రెండేళ్లుగా వరకట్న వేధింపులు, హత్య కేసు.. ఇప్పుడు ఊహించని ట్విస్ట్

Mana Shankara Varaprasad Garu: ‘మీసాల పిల్ల’ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. ఎలా మెగాస్టార్ ఇలా?

Ponnam Prabhakar: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి మంత్రి పొన్నం ధన్యవాదాలు.. కారణం ఏంటంటే?