Purushaha Update
ఎంటర్‌టైన్మెంట్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘పురుష:’ ఎంత వరకు వచ్చిందంటే..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అనగానే అందరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకుంటారేమో.. ఆయన కాదు. ఇప్పుడు కొత్తగా వెండితెరకు మరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పరిచయం అవుతున్నారు. పవన్ కళ్యాణ్‌ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ బత్తుల కోటేశ్వరరావు భారీ ఎత్తున నిర్మిస్తున్న చిత్రం ‘పురుష:’ (Purushaha). ‘మళ్లీ రావా, జెర్సీ, మసూద’ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన వీరు ఉలవల (Veeru Vulavala) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కళ్యాణ్ ప్రొడక్షన్స్ (Kalyan Productions) బ్యానర్‌పై ఓ డిఫరెంట్ కామెడీ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ దశమి (Dussehra)ని పురస్కరించుకుని మేకర్స్ తాజాగా ఈ చిత్ర అప్డేట్‌ని మేకర్స్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటున్నట్లుగా మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలియజేశారు.

Also Read- Jr NTR: ఊహకందని అద్భుతం.. ‘కాంతార: చాప్టర్ 1’ రెస్పాన్స్‌‌పై తారక్ ఆసక్తికర పోస్ట్

డిఫరెంట్ కామెడీ మూవీ

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రేక్షకులను మెప్పించాలంటే కంటెంట్ బాగుండాలి. కంటెంట్ ఈజ్ కింగ్ అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ కంటెంట్ ప్రధానంగా వచ్చే హాస్య భరితమైన చిత్రాలు ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. కామెడీతో పాటుగా, సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమాలు ఈ మధ్య ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తున్నాయి. అలాంటి ఓ డిఫరెంట్ కామెడీ మూవీనే ‘పురుష:’. ఈ కామెడీ బేస్డ్ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ ఇందులో అద్భుతమైన పాత్రలను పోషించారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఈ మూవీలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. గబి రాక్, అనైరా గుప్తా కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఓ ప్రత్యేక గీతంతో షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేశాం. చిత్రీకరణ ముగియడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టాం.

Purushaha Team meets Veera Shankar

Also Read- Allu Sirish: నయనికతో నిశ్చితార్థం.. అధికారికంగా ప్రకటించిన అల్లు శిరీష్

త్వరలోనే రిలీజ్ డేట్

ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఆయన కొత్త హీరో అయినప్పటికీ అద్భుతంగా నటించారు. ఆ విషయం రేపు ఈ సినిమా చూసిన వారంతా చెబుతారు. మాకు (దర్శకనిర్మాతలకు) కూడా ఇదే మొదటి ప్రాజెక్ట్. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసి రిలీజ్ డేట్‌‌ను ప్రకటిస్తాం. ఈ మూవీకి టాలెంటెడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్‌గా రవిబాబు దొండపాటి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మేమంతా కలిసి ఓ మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు ఇవ్వబోతున్నామనే నమ్మకంతో ఉన్నామని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponnam Prabhakar: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి మంత్రి పొన్నం ధన్యవాదాలు.. కారణం ఏంటంటే?

Rahul Ramakrishna: కేసీఆర్, కేటీఆర్.. కలకలం రేపుతోన్న రాహుల్ రామకృష్ణ ట్వీట్స్!

IOB Good News: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అదిరిపోయే గుడ్‌న్యూస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘పురుష:’ ఎంత వరకు వచ్చిందంటే..

Planes collision: ఎయిర్‌పోర్టులో ఢీకొన్న రెండు విమానాలు.. విరిగిపోయిన ఓ విమానం రెక్క