Allu Sirish and Nayanika Engagement
ఎంటర్‌టైన్మెంట్

Allu Sirish: నయనికతో నిశ్చితార్థం.. అధికారికంగా ప్రకటించిన అల్లు శిరీష్

Allu Sirish: అల్లు వారి చిన్నబ్బాయ్.. అల్లు శిరీష్ (Alli Sirish) తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన శుభవార్తను ప్రకటించారు. తన ప్రియురాలు నయనిక (Nayanika)తో తన నిశ్చితార్థం జరిగినట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రకటనను ఆయన తన తాత, దివంగత లెజెండరీ నటుడు, హాస్యనటుడు అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన మనసులోని మాటను తెలియజేస్తూ, శిరీష్ ఒక భావోద్వేగ సందేశం పోస్ట్ చేశారు. వాస్తవానికి కొన్ని రోజులుగా అల్లు శిరీష్ నిశ్చితార్థానికి సంబంధించి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అమ్మాయి ఎవరనేది క్లారిటీ రాలేదు కానీ, నిశ్చితార్థం (Allu Sirish and Nayanika Engagement) అయితే పూర్తయిందనే విషయం బాగా సర్క్యూలేట్ అయింది. ఇప్పుడు అల్లు శిరీషే ప్రకటించడంతో.. దాగుడు మూతలకు తెరపడినట్లయింది.

Also Read- US Shutdown: షట్ డౌన్‌లోకి అమెరికా.. ఆగిపోయిన ప్రభుత్వ సేవలు.. 6 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైమ్

నయనికతో నిశ్చితార్థం

ఇక అల్లు శిరీష్ తాజాగా తన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లో ఏం చెప్పారంటే.. ‘‘నయనికతో నా నిశ్చితార్థం. నేడు, మా తాత అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా, నా జీవితానికి అత్యంత ముఖ్యమైన, నా హృదయానికి ఎంతో దగ్గరైన విషయాన్ని పంచుకోవడాన్ని ఆ దైవ ఆశీర్వాదంగా భావిస్తున్నాను’’. ఇంకా ఇందులో ఇటీవల మరణించిన నానమ్మ గురించి శిరీష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘నా పెళ్లి చూడాలని మా నానమ్మ ఎప్పుడూ కోరుకునేవారు. ఆమె ఇప్పుడు మాతో లేకపోయినా, మేము ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ఆమె పైనుండి మాకు ఆశీస్సులు అందిస్తుంటారని భావిస్తున్నాను’’ అని శిరీష్ పేర్కొన్నారు. ఇంకా తమ ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించి, ఎంతో సంతోషంగా ఆశీర్వదించడం చాలా ముఖ్యమైన విషయంగా ఆయన తెలిపారు. అయితే నయనిక ఎవరనేది మాత్రం ఆయన వెల్లడించలేదు.

Also Read- OG New Updates: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ న్యూ అప్డేట్స్.. మళ్లీ థియేటర్లకు క్యూ కట్టాల్సిందే!

అల్లు వారింట పెళ్లి బాజాలు

ఈ పోస్ట్‌తో పాటు తన ప్రేయసి చేయి పట్టుకుని నడిచి వెళుతున్న ఫొటోని కూడా ఆయన జత చేశారు. ప్రస్తుతం అల్లు శిరీష్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతూ.. త్వరలోనే అల్లు వారింట పెళ్లి బాజాలు మోగనున్నాయని అంతా కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి దూరంగా ఉండే శిరీష్.. తన మనసుకు దగ్గరైన ఈ విషయాన్ని తెలియజేసి, అభిమానులను ఆకట్టుకున్నారు. అల్లు శిరీష్ చేసిన ఈ ప్రకటనతో.. సినీ పరిశ్రమ ప్రముఖులు, స్నేహితులు, అభిమానులు ఈ జంటకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న శిరీష్‌-నయనిక జంటకు అంతా మంచే జరగాలని అందరూ కోరుకుంటున్నారు. త్వరలోనే వీరి వివాహ తేదీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Mass Jathara: ఫైనల్‌గా ‘మాస్ జాతర’ రిలీజ్ ఎప్పుడంటే.. ఆసక్తికర వీడియో వదిలిన మేకర్స్!

Collector Hymavathi: నిష్పక్షపాతంగా ఎన్నికల సిబ్బంది వ్యవహరించాలి: కలెక్టర్ హైమావతి

Richest Indians: సంపన్నుల లిస్ట్ విడుదల.. బిలియనీర్ల జాబితాలోకి షారుఖ్‌.. ఎవరి ఆస్తి ఎంతంటే?

School Principal: బ్యాంక్ చెక్‌లో అక్షర దోషాలు.. అడ్డంగా బుక్కైన ప్రిన్సిపల్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

Kantara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’ ప్రీమియర్ షోస్ రద్దు.. కారణమిదే!