Ravi Teja and Sreeleela in Mass Jathara
ఎంటర్‌టైన్మెంట్

Mass Jathara: ‘తు మేరా లవర్‌’.. ఇదేందయ్యా ఇది.. అస్సలు ఊహించలే!

Mass Jathara: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) తన ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేసేందుకు ఈసారి జాతరతో రాబోతున్నాడు. ఇది అలాంటిలాంటి జాతర కాదు.. ‘మాస్ జాతర’. అవును రవితేజ హీరోగా, శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. ఈ సినిమా రవితేజ కెరీర్‌కు ఎంతో కీలకమనే విషయం తెలియంది కాదు. ‘ధమకా’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తర్వాత రవితేజ‌కు సరైన హిట్ లేదు. దీంతో ఈ సినిమాపైనే రవితేజ ఆశలన్నీ ఉన్నాయి.

Also Read- Anasuya: లుక్ మార్చేసిన అనసూయ.. ఇలా ఎప్పుడూ చూసి ఉండరేమో?

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత వచ్చిన ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘ఈగల్’ వంటి చిత్రాలు రవితేజకు హిట్‌ని ఇవ్వలేకపోయాయి. దీంతో మరోసారి ‘మిరపకాయ్’ డైరెక్టర్ హరీష్ శంకర్‌ (Harish Shankar)ని నమ్ముకుని ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) అనే సినిమా చేస్తే ఆ సినిమా దారుణంగా ఫెయిలైంది. దీంతో మరోసారి రవితేజ కెరీర్ కష్టాల్లో పడింది. అంతకు ముందు కూడా ఇలానే వరుసగా ఫ్లాప్స్ వస్తున్నప్పుడు గోపీచంద్ మలినేని, ఈ మాస్‌రాజాకు మరిచిపోలేని హిట్ ఇచ్చాడు. ఇప్పుడు నూతన దర్శకుడు భాను భోగవరపుని నమ్ముకుని ‘మాస్ జాతర’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు.

తాజాగా ఈ చిత్ర ఫస్ట్ సింగిల్‌ రిలీజ్‌కు సంబంధించిన అప్డేట్‌తో టీమ్ సర్‌ప్రైజ్ చేసింది. మరోసారి ‘ధమాకా’ బ్యూటీతో రవితేజ చేస్తున్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేస్తూ, ఫస్ట్ సింగిల్ ‘తూ మేరా లవర్’ సాంగ్‌ ప్రోమో (Tu Mera Lover Promo)ని మేకర్స్ వదిలారు. ఈ సాంగ్ ప్రోమోతోనే ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించేశారు. అవును, ఎవరూ ఊహించని విధంగా ఈ సాంగ్‌లో పూరి జగన్‌తో రవితేజ చేసిన ‘ఇడియట్’ (Idiot) సినిమాలోని ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే’ పాటలోని ఐకానిక్ స్టెప్పును, బీట్‌ను రీ క్రియేట్ చేశారు. నిజంగా ఇది ఎవరూ ఊహించనిది. ఈ సర్‌ప్రైజ్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Also Read- Naresh: సీరియల్ నటితో స్టెప్పులేసిన నరేష్ .. వైరల్ అవుతున్న వీడియో

ఈ ఐకానిక్ స్టెప్పులో అప్పటి రవితేజ, ఇప్పటి రవితేజను పోల్చుతూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో మీసకట్టుతో రవితేజ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంటే, పక్కన శ్రీలీల కూడా తన డ్యాన్సింగ్ స్కిల్‌తో కవ్విస్తోంది. ఏప్రిల్ 14న చూసుకుందాం అనేలా ఆమె ఈ ప్రోమోలో ఇచ్చిన లుక్.. మాములుగా లేదు. అందుకే మేకర్స్ కూడా గోల్డెన్ సర్‌ప్రైజ్ లోడింగ్ అంటూ ఈ ప్రోమోని ఎండ్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో అయితే సినిమాపై బ్లాక్‌బస్టర్ వైబ్‌ని ఏర్పడేలా చేస్తూ.. ట్రెండ్ అవుతోంది. మాస్ రాజా ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు