Mario Movie Poster
ఎంటర్‌టైన్మెంట్

Mario: ‘మారియో’.. వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ చూశారా?

Mario: వాలెంటైన్స్‌ డేని పురస్కరించుకుని టాలీవుడ్‌లో రూపుదిద్దుకుంటున్న నూతన సినిమాల నుండి చాలా అప్డేట్స్ వచ్చాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే అందరినీ ఆకర్షించాయి. అలా ఆకర్షించిన వాటిలో ‘మారియో’ పోస్టర్ ఒకటి. ‘నాటకం, తీస్ మార్ ఖాన్’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తన మార్క్‌ని ప్రదర్శించిన కళ్యాణ్‌జీ గోగన.. ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్‌తో ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్లపై రిజ్వాన్ నిర్మిస్తున్న చిత్రం ‘మారియో’. ఈ సినిమాతో అనిరుధ్ హీరోగా పరిచయం కాబోతున్నారు.

Also Read- Klin Kaara: మెగా ప్రిన్సెస్ క్లీంకారా ఫేస్ రివీలైంది.. ఎంత క్యూట్‌గా ఉందో!

టాలెంటెడ్ బ్యూటీ హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్‌ని వాలెంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. ఈ టైటిల్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఇదొక అడ్వెంచరస్ సినిమాలా అనిపిస్తోంది. ఫన్ రైడ్ అనే క్యాప్షన్ చూస్తుంటే.. ఇందులో కావాల్సినంత వినోదాన్ని మేకర్స్ ఇవ్వబోతున్నారనేది అర్థమవుతోంది. కామిక్ థ్రిల్లర్‌గా కళ్యాణ్‌జీ గోగన రూపొందిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కథా రచనలో, అలాగే మాటలు అందించడంలో దర్శకుడు కళ్యాణ్‌జీ గోగనకి రాకేందు మౌళి సహకారం అందిస్తున్నారు.

ప్రస్తుతం ప్రేక్షకులు ఒకే జానర్ చిత్రాలను అస్సలు ఇష్టపడటం లేదు. రెండు మూడు రకాల జానర్స్ మిక్స్‌తో, ఆశ్చర్యపరిచే స్క్రీన్‌ప్లేతో వచ్చిన సినిమాలనే.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సినిమాలో కూడా కొత్త కంటెంటే కాకుండా.. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సినిమా ఉంటుందని కళ్యాణ్‌జీ గోగన హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Balakrishna: థమన్‌కు బాలయ్య కాస్ట్‌లీ గిఫ్ట్.. ఊహించలేదు కదా!

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ‘వాలెంటైన్స్ డే’ సర్‌‌ఫ్రైజ్‌ చూశారా..

Janhvi Kapoor X Pa. Ranjith: శభాష్.. బోల్డ్ స్టెప్ వేసిన జాన్వీ

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!