Manchu Manoj: ‘మిరాయ్’ సక్సెస్‌తో ఆ చిత్ర టీమ్ అంతా సంతోషంలో మునిగిపోయింది. సెప్టెంబర్ 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనతో టీమ్ అంతా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ క్రమంలో మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మంచు మనోజ్ తన మదర్ నుంచి ఆశీస్సులు తీసుకుంటున్నారు. కొన్నాళ్లుగా వారి ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు చోటు చేసుకున్నాయో తెలియంది కాదు. కానీ, ఇప్పుడన్నీ సర్దుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో అన్నట్లుగా, మనోజ్ షేర్ చేసిన వీడియో ఉంది.
సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు.
మిరాయ్ ప్రాజెక్ట్‌లో తనకి ఎలా అవకాశం వచ్చిందో మంచు మనోజ్ తెలిపారు.
నాకు కార్తిక్ గారు ఎప్పటినుంచో తెలుసు. అలాగే తేజ చిన్నప్పటి నుంచి తెలుసు. తను చాలా క్యూట్ గా ఉంటాడు. ఎక్కడ కనిపించినా బుగ్గలు గిల్లేసేవాడిని(నవ్వుతూ). తను ఒక ఈవెంట్ కలిసినప్పుడు ‘మంచి స్క్రిప్ట్ వుంటే కలిసి సినిమా చేద్దాం తమ్ముడు’అని చెప్పాను. ‘నిజమా అన్నా’అన్నాడు. ఓ రోజు మా గేమింగ్ స్టూడియోలో వున్నప్పుడు తేజ వచ్చి మిరాయ్ గురించి చెప్పాడు. కథ, మా ఇద్దరి పాత్రల గురించి ఇప్పుడే ఎక్కువ రివిల్ చేయకూడదు. కార్తిక్ గారు చెప్పిన కథ చాలా నచ్చింది.
-శ్రీరాముల వారి నేపధ్యం, తొమ్మిది పుస్తకాల బ్యాక్ డ్రాప్, ఇతిహాసల కోణం చాలా అద్భుతంగా వుంటుంది. ఇందులో నా క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా వుంటుంది. లేజీగా వుండేవాడు బ్రతకకూడదనే క్యారెక్టర్. కార్తిక్ గారు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. చాలా స్పెషల్ కేర్ తీసుకున్నాం.