Chiranjeevi Records: మెగాస్టార్ మొదటి రోజు కలెక్షన్లు ఇరగదీశారుగా
msg-day1-collections
ఎంటర్‌టైన్‌మెంట్

Chiranjeevi Records: ‘మన శంకరవరప్రసాద్ గారు’ మొదటి రోజు కలెక్షన్లు ఇరగదీశారుగా.. ఎంతంటే?

Chiranjeevi Records: టాలీవుడ్ మెగాస్టార్ మరోసారి సినిమా పరిశ్రమకు తన సత్తా ఏమిటో చూపించారు. మెగాస్టార్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి రోజు ప్రీమియర్లతో కలిపి మొత్తం రూ.84 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు వచ్చిన సినిమాగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ ‘షైన్ స్క్రీన్స్’ అధికారికంగా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అందుకు తగ్గట్లుగా భారీ వసూళ్లు కూడా రాబడుతోంది. దీంతో నిర్మాతల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ చిత్రం ప్రీమియర్స్ మొదటి రోజు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసింది.

READ ALSO-Anaganaga Oka Raju: నవీన్ పొలిశెట్టి సినిమా టికెట్ ధరల పెంపుపై.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

ఈ స్థాయి వసూళ్లు రావడం టాలీవుడ్‌లో ఒక అరుదైన ఫీట్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా రికార్డులను తిరగరాసింది. దాదాపు అన్ని సెంటర్లలో ‘ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్స్’ సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి ఉన్న క్రేజ, పాజిటివ్ టాక్ కారణంగా రెండో రోజు కూడా థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. షైన్ స్క్రీన్స్ తమ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేస్తూ, “మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ బద్దలుకొట్టేసారు” అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేవలం ఒకే రోజులో రూ. 84 కోట్లు దాటడం చూస్తుంటే, లాంగ్ రన్ లో ఈ సినిమా మరిన్ని బెంచ్ మార్క్ రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమనిపిస్తోంది. మొత్తం మీద ‘మన శంకరవరప్రసాద్ గారు’ తన పవర్ ఫుల్ ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ వద్ద నిజమైన ‘సంక్రాంతి’ ముందే తెచ్చారని అభిమానులు సంబరపడుతున్నారు.

Read also-Prabhas: ప్రభాస్.. ఈ కటౌట్‌ని వాడుకోలేకపోయిన డైరెక్టర్స్ వీరే..!

Just In

01

Chiranjeevi Premier: బాలయ్య బాబు రికార్డును బ్రేక్ చేసిన మెగాస్టార్.. ఎందులోనంటే?

Mahabubabad: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకే ‘అరైవ్‌ అలైవ్‌’.. ఎస్పీ శబరీష్ కీలక సూచనలు ఇవే!

Medaram Jatara 2026: మేడారంలో ఈ నెల 18న తెలంగాణ కేబినెట్‌ భేటీ.. మంత్రి సీతక్క కీలక ప్రకటన

Naveen Polishetty: ‘అనగనగా ఒక రాజు’కి ఆ నమ్మకంతో టికెట్స్ బుక్ చేసుకోండి

Ponguleti Srinivas Reddy: ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి!