Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్ట్ ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు తెరలేపింది. ఆయన ఎవరి పేరును ప్రస్తావించనప్పటికీ, ఒక వ్యక్తి యొక్క అబద్ధాలు, మోసపూరిత వైఖరిని ఎత్తి చూపుతున్నట్లుగా పదునైన వాక్యాలతో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అసలు ఆయన ఎవరిని ఉద్దేశించి రాశారనే దానిపై నెటిజన్లు, సినీ వర్గాలు ఆరాలు తీస్తున్నాయి. బండ్ల గణేష్ ఈ పోస్ట్‌ను ఒక బలమైన కొటేషన్‌గా పోస్ట్ చేసి ఉండవచ్చని కొందరు అనుకుంటుంటే… ఒక వ్యక్తి అబద్ధాల స్వభావాన్ని వివరిస్తూ రాసిన వాక్యాలుగా, తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాన్ని గానీ, లేదా ఇండస్ట్రీలోని ఏదో ఒక ముఖ్య వ్యక్తి యొక్క అసలు స్వభావాన్ని గానీ బయటపెడుతున్నాడని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు.
Also Read- Ravi Teja: మాస్ మహారాజా రవితేజ రూటు మారుస్తున్నాడా? ‘మాస్’ వద్దనుకుంటున్నాడా?
ఆయన ఏం పోస్ట్ చేశారంటే..
బండ్ల గణేష్ ఒక వ్యక్తి గురించి వివరిస్తూ.. ‘‘అతను గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి అబద్ధాలు చెబుతాడు. అతను తన గురించి, తన నేపథ్యం, విద్య గురించి నిరంతరం అబద్ధాలు చెబుతాడు. విజయాలు, వైఫల్యాలు రెండింటి గురించి కూడా అతను అసత్యాలే ప్రచారం చేస్తాడు. అబద్ధం చెబుతున్నాడని పట్టుబడినప్పుడు, ఆ అబద్ధం గురించి కూడా మళ్లీ అబద్ధం చెబుతాడు. అబద్ధాలకు సాక్ష్యం ఉన్నప్పుడు, ఇతరులే అబద్ధం చెప్పారు అని ఎదురుదాడి చేస్తాడు. ఆ తర్వాత సులభంగా పాత అబద్ధాలను వదిలేసి, కొత్త అబద్ధాలకు వెళ్తాడు’’ అని రాసుకొచ్చారు. అసలు ఈ అబద్ధాల పురాణం ఇప్పుడెందుకు ఆయన ఎత్తాడనేదే ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ పోస్ట్ అనే కాదు.. ఈ పోస్ట్‌కు ముందు చేసిన రెండు పోస్ట్‌లు కూడా.. ఏదో బుక్‌లో నుంచి తీసుకొచ్చి పోస్ట్ చేసినట్లుగా ఉన్నాయి.
Also Read- Rashmika Mandanna: ‘ఇదంతా మీ కష్టంతోనే సాధ్యమైంది’.. రష్మిక పోస్ట్ వైరల్!
ఎవరిని ఉద్దేశించి?.. ఊహాగానాలు, రచ్చ
బండ్ల గణేష్ పోస్ట్‌లు ఎప్పుడూ సెన్సేషనల్‌గా ఉంటాయి. ఆయన తరచుగా ఎవరినీ నేరుగా విమర్శించకుండా, పరోక్షంగా కొటేషన్ల రూపంలో తన అసంతృప్తిని, అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. గతంలో ఆయన చేసిన కొన్ని పోస్టులు కూడా ప్రముఖులను ఉద్దేశించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ‘అబద్ధాల మనిషి’ గురించి చేసిన ఈ పోస్ట్ కూడా సినిమా ఇండస్ట్రీలోని ఒక పెద్ద వ్యక్తిని, రాజకీయాల్లోని ఒక ప్రముఖుడిని టార్గెట్ చేసి ఉండవచ్చని నెటిజన్లు అనుకుంటున్నారు. ప్రస్తుత రాజకీయ, సినీ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే, బండ్ల గణేష్ ఇంత కఠినమైన పదజాలంతో కొటేషన్‌ను పంచుకోవడం వెనుక బలమైన కారణమే ఉండి ఉంటుందని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, ఈ ‘అబద్ధాల కొటేషన్’ వెనుక ఉన్న ఆ వ్యక్తి ఎవరనేది టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అతను గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి అబద్ధాలు చెబుతాడు
అతను తన గురించి అబద్ధాలు చెబుతాడు
అతను తన నేపథ్యం గురించి అబద్ధాలు చెబుతాడు
అతను తన విద్య గురించి అబద్ధాలు చెబుతాడు
అతను తన విజయాల గురించి అబద్ధాలు చెబుతాడు
అతను తన వైఫల్యాల గురించి అబద్ధాలు చెబుతాడు
అబద్ధం చెబుతున్నాడని…— BANDLA GANESH. (@ganeshbandla) October 5, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
