Malavika Mohanan: టాలీవుడ్ పై మాళవిక మోహన్ కామెంట్స్ వైరల్..
Malavika-Mohanan
ఎంటర్‌టైన్‌మెంట్

Malavika Mohanan: టాలెంట్ తొక్కేస్తున్నారు.. సరిగా వాడుకోవట్లేదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Malavika Mohanan: తెలుగు తమిళ సినిమాల్లో హీరోయిన్లను చిన్న చూపు చూస్తారు అంటూ ప్రభాస్ ‘ది రాజాసాబ్’ హీరోయిన్ మాళవిక మొహన్ చెప్పుకొచ్చారు. తాజాగా ఈ వ్యాఖ్యలు తెలుగు, తమిళ పరిశ్రమల్లో తీవ్ర దుమారం రేపుతోంది. అసలు ఆమె ఎందుకు అలా చెప్పుకొచ్చారు. ఏం చెప్పారు అంటే? తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో దర్శకులు హీరోయిన్లను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదన్నారు. ఎమోషన్ వచ్చే సమయంలో అక్కడ మొఖం కొంచెం తింగరిగా ఏడుపు మొఖం పెడితే సరిపోతుందంటారన్నారు. ఏడ్చే సీన్లలో కూడా అసలు ఏడవనివ్వరని, సిరియస్ ఫేస్ పెడితే సరిపోతుందని, అలాంటప్పుడు తమను ఎందుకు తీసుకుంటారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తెలుగు, తమిళం పరిశ్రమల్లో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు చాలా తక్కువగా వస్తాయి. వాటిని ఆదరించేవారు కూడా చాలా తక్కువ మంది ప్రేక్షకులు ఉంటారు. అందుకే హీరోయిన్లకు ప్రాధాన్యం తక్కువ గా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.

Read also-Janaki’s Son Passes Away: ప్రముఖ గాయని ఎస్ జానకి కుమారుడు ఇక లేరు.. ఏం జరిగిందంటే?

తెలుగు తమిళ సినిమాల్లో హీరోయిన్లకు అంతగా ప్రాధాన్యం ఉండదు. ఎందుకంటే ఇక్కడి వారు హీరో సెంట్రిగ్ గా సినిమాలు రాసుకుంటారు. అదే విధంగా సినిమాలు తీస్తారు. సినిమా మొత్తం హీరోనే కనిపించే విధంగా ఇక్కడి చిత్రాలు ఉంటాయి. అప్పుడెపుడో వచ్చిన అరుంధితి తప్పితే అంతటి విజయాలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ఇప్పటి వరకూ కనబడలేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన అనుష్క శెట్టి ఘాటీ కూడా ఆశించినంత ఆడలేదు. దీంతో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు ఇక్కడ కాలం చెల్లినట్లు అనిపిస్తుంది. తాజాగా ది రాజాసాబ్ హీరోయిన్ కూడా ఇదే విధంగా అభిప్రాయ పడ్డారు. ఎందుకంటే తెలుగు, తమిళ సినిమాల్లో అసలు హీరోయిన్లను సరింగా నటించనివ్వరని, వారు కొంచెం వారి ప్రతిభ చూపిస్తే సరిపోతుందని ఆమె చెప్పుకొచ్చారు. అంటే ఆమె చెప్పినట్లు యాక్టింగ్ కన్నా హీరోయిన్ అందానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అని అర్థం అవుతుంది.

Read also-Karate Kalyani: కరాటే కళ్యాణిపై దాడి ఘటనలో పలువురిపై కేసు..

తాజాగా మాళవిక మోహన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమే అయినా తెలుగు, తమిళ పరిళ్రమల్లో హీరోయిన్లకు తగిన ప్రాథాన్యత ఇవ్వడం లేదని మాళవిక మాటల్లో తెలుస్తోంది. ఈ ఘటనతో అయినా తెలుగు, తమిళ దర్శకులు మళ్లీ హీరోయన్లకు తగిన ప్రాధాన్యత ఇస్తారేమో చూడాలి మరి. అయతే తెలుగు, తమిళ పరిశ్రమలు మాత్రమే ఇలా ఉన్నాయి అంటే కొంత వరకూ అవును అనే చెప్పాలి. ఎందుకుంటే తాజాగా మళయాళంలో వచ్చిన హీరోయిన్ సెంట్రిక్  చంద్ర లోక సినిమా బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొట్టింది. ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాంటి సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో అసలు నిర్మించడానికే నిర్మాతలు ధైర్యం చేయడంలేదు. ఇటీవల వచ్చిన చంద్ర లోక సినిమా హీరోయిన్ సెంట్రిక్ సినిమాలకు కొత్త ఊపిరి పోసిందనుకోవచ్చు.

Just In

01

Uttam Kumar Reddy: అవినీతి, అక్రమాలకు పాల్పడే మిల్లర్లను ఊపేక్షించేది లేదు.. వారికి మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ వార్నింగ్!

Hydra: 6.12 ఎకరాల భూమి కబ్జా.. 3 ఎక‌రాల మామిడితోట ఎవ‌రిదంటే? హైడ్రా కీలక ప్రకటన!

Etela Rajender: మున్సిపోరుపై కమలం కసరత్తు.. రంగంలోకి ఎంపీ ఈటల!

BJP Telangana: మున్సిపోరుపై కమలం కసరత్తు.. ఉత్తర తెలంగాణపై ఫుల్ ఫోకస్!

Davos Summit: తెలంగాణ రైజింగ్ 2047కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మద్ధతు