Mahesh Babu: తెలుగు సూపర్‌స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో డీసెంట్ ఫ్యామిలీ ఎవరిదైనా ఉందంటే అది మహేష్ బాబు కుటుంబమే అని చెబుతారు. ఎందుకంటే, ఇంత వరకు ఎవరితో ఎలాంటి గొడవలు లేవు. సినిమాలు హిట్ అయినా.. ఫ్లాప్ అయినా తన ఫ్యాన్స్ కోసం సినిమాలు చేస్తున్నాడు.
Also Read: OG Film: పవన్ కళ్యాణ్ ఓజీలో స్పెషల్ సాంగ్ చేయబోతున్న హీరోయిన్ ఎవరంటే? భలే ఆఫర్ పట్టేసిందిగా!
అయితే, ఈ రోజు తన కుమారుడు గౌతమ్ ఘట్టమనేని 19వ పుట్టినరోజు సందర్భంగా హృదయాన్ని హత్తుకునే సందేశాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మహేష్ బాబు తన ఎక్స్ ( ట్విట్టర్) ఖాతాలో గౌతమ్ చిన్నప్పటి ఫోటోను షేర్ చేస్తూ, “హ్యాపీ 19 మై సన్. ప్రతి ఏడాది నీవు నన్ను మరింత ఆశ్చర్యపరుస్తున్నావు.. ఈ సంవత్సరం నీ పుట్టినరోజును నేను మిస్ అవుతున్నాను, ఇది నేను మిస్ చేసిన మొదటి పుట్టినరోజు. నా ప్రేమ నీతో ప్రతి అడుగులో ఉంటుంది… నీవు ఏం చేసినా ఎల్లప్పుడూ నీ అతిపెద్ద చీర్‌లీడర్‌గా ఉంటాను.నువ్వు అనుకున్నది సాధించాలి” అని రాశారు. ఫోటోలో గౌతమ్ ఒక హైడ్రాలిక్ బొల్లార్డ్‌పై కూర్చుని ఉండగా, మహేష్ అతను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు కనిపిస్తారు. ఈ పోస్ట్ పై రియాక్ట్ అయిన ఫ్యాన్స్ గౌతమ్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు.
Also Read: Amitabh Bachchan: మరోసారి బాలయ్యకు హ్యాండిచ్చిన అమితాబ్.. ఫంక్షన్‌కు పిలిస్తే రాకుండా ఏం చేశారంటే?
గౌతమ్ ప్రస్తుతం న్యూయార్క్ యూనివర్సిటీలో నటనలో నాలుగేళ్ల కోర్సు చేస్తున్నారు. 2014లో, అతను తన తండ్రి మహేష్ బాబు పాత్ర యొక్క చిన్నతనపు వెర్షన్‌గా ” 1: నేనొక్కడినే ” సినిమాలో మొదటిసారి నటించారు. ఇటీవల, అతను లండన్‌లో ‘రోమియో జూలియట్ & ETC’ నాటకంలో నటించి, తన నటనా ప్రతిభను ప్రదర్శించాడు, ఈ ప్రదర్శనకు మహేష్, నమ్రత, సితారలు హాజరై ప్రశంసలు అందించారు.
Also Read: Allu Kanakaratnamma: ముగిసిన అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు.. పాడె మోసిన చిరు, మనవళ్లు!
Happy 19 my son!! Each year you amaze me a little more… ♥️♥️♥️ Missing your birthday this year, the only one i have ever missed… my love is with you every step of the way….😘😘😘 Always your biggest cheerleader in whatever you do… keep shining and keep growing…🤗🤗🤗 pic.twitter.com/0bV51ZRR8S
— Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2025
