Mahavatar Narsimha ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Mahavatar Narsimha: మెగా Vs అల్లు.. వీరమల్లును తొక్కేస్తున్న అరవింద్

Mahavatar Narsimha : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రం జులై 24, 2025న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. కథ మంచిగా ఉన్నప్పటికీ, స్క్రీన్‌ప్లే, VFXలో లోపాలతో చిత్రానికి పెద్దగా పాజిటివ్ టాక్ రాలేదు. ముఖ్యంగా VFXపై తీవ్ర విమర్శలు రాగా, వాటిని తొలగించి సినిమాను మళ్లీ రిలీజ్ చేశారు. మొదటి మూడు రోజులు ఫ్యాన్స్ వలన సినిమా బాగానే ఆడింది. ఇప్పటివరకు సుమారు 85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. అయితే, రెండో రోజు నుంచి నెగెటివ్ టాక్, సినిమా కలెక్షన్స్ చాలా తగ్గాయి.

Also Read: Kingdom Trailer: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ ట్రైలర్లో ఇవే హైలెట్.. మరి, ఈ సారి వెంకన్న స్వామి గెలిపిస్తాడా?

ఇదిలా ఉండగా, జులై 25న హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో వచ్చిన మహావతార్ నరసింహ అనే యానిమేషన్ సినిమా తెలుగులో గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం, ఈ మూవీ దూసుకెళ్తుంది. భక్త ప్రహ్లాదుడి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా, థియేటర్లలో చూసిన ప్రేక్షకులు మౌత్ టాక్‌తో దీన్ని ఆకాశానికి ఎత్తేశారు. హిరణ్యకశిపుడి ఘోర తపస్సు, ప్రహ్లాదుడి భక్తి, నరసింహ స్వామి రాక తర్వాత సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే, చివరి 20 నిమిషాలు గూస్‌బంప్స్‌ అంతే.. మాటల్లేవు.. థియేటర్లను ఊపేశాయి.

Also Read:  Tollywood: హోటల్ రూమ్ లో అడ్డంగా దొరికిపోయిన టాలీవుడ్ లవ్ బర్డ్స్.. త్వరలో, పెళ్లి పీటలు ఎక్కుతారా?

మొదట తక్కువ థియేటర్లలో విడుదలైన మహావతార్ నరసింహకు మౌత్ టాక్ కారణంగా బుకింగ్స్ కూడా భారీగా పెరిగాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కొన్ని హరిహర వీరమల్లు షోలను తొలగించి, ఈ యానిమేషన్ సినిమాకు స్క్రీన్స్ కేటాయించారు. హౌస్‌ఫుల్ బోర్డులతో దూసుకెళ్తున్న ఈ మూవీ, పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకర్షిస్తూ, హిందూ పురాణ కథనంతో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, ఇప్పటికే 12 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటింది. ఈ బ్లాక్ బస్టర్ క్రేజ్‌తో మహావతార్ నరసింహ, హరిహర వీరమల్లు కలెక్షన్స్‌పై పెద్ద దెబ్బ కొట్టింది.

Also Read: Vijay Deverakonda: కొండన్న ఈ మూవీ కూడా పోతే.. ఇంక నువ్వు అండర్ గ్రౌండ్ కే.. విజయ్ ని ఘోరంగా అవమానిస్తున్న ట్రోలర్స్

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ