Madharaasi OTT: కోలీవుడ్‌లో వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ, అద్భుతమైన నటనతో అభిమానులను, స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటించిన హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘మదరాసి’ (Madharaasi). ఏ.ఆర్. మురుగదాస్ (AR Murugadoss) దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి విడుదలై, మంచి స్పందననే రాబట్టుకున్ ఈ సినిమా.. కలెక్షన్లపరంగా మాత్రం మేకర్స్‌ని డిజప్పాయింట్‌కు గురి చేసింది. ‘ఘాటి’ (Ghaati), ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts) వంటి చిత్రాల పోటీని తట్టుకుని ‘మదరాసి’ బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్‌గా నిలవలేకపోయింది. ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో.. స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Balakrishna Controversy: బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి- అఖిల భారత చిరంజీవి యువత
‘మదరాసి’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్..
శివకార్తికేయన్ సరసన రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా, అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అందుబాటులోకి రానుంది. దీనితో శివ కార్తికేయన్ అభిమానుల నిరీక్షణ ఫలించింది. నిరీక్షణ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీపై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు, తేదీలు ప్రచారమయ్యాయి. అన్నిటికీ తెరదించుతూ, అమెజాన్ ప్రైమ్ వీడియో తాజాగా అధికారిక ప్రకటన చేయడంతో, ఎస్‌కె ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఈ విషయాన్ని హీరో శివకార్తికేయన్ ఫ్లకార్డులా ప్రదర్శిస్తున్న ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘మదరాసి’ చిత్రాన్ని థియేటర్లలో చూడలేకపోయిన వారంతా.., ఇప్పుడు తమ ఇంట్లో హాయిగా కూర్చొని ఈ చిత్రాన్ని చూడవచ్చు. ఈ సినిమాకు శివ కార్తికేయన్ నటన, ఏఆర్ మురుగదాస్ టేకింగ్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అలాగే, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమా స్థాయిని మరింతగా పెంచింది. యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు కలగలిసిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి ఈ చిత్రం పలు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
Also Read- Prasads Multiplex: మేము బాధ్యత వహించలేము.. ‘ఓజీ’ ఫ్యాన్స్‌కి ప్రసాద్స్ మల్టీప్లెక్స్ రిక్వెస్ట్!
‘మదరాసి’ కథ విషయానికి వస్తే..
తమిళనాడు రాష్ట్రానికి తుపాకీ సంస్కృతిని పరిచయం చేసి, వ్యాపారం చేయాలని ఒక సిండికేట్ ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో ఇద్దరు స్నేహితులు విరాట్ (విద్యుత్ జమ్వాల్), చిరాగ్ (షబీర్ కల్లరక్కల్)లను ఈ పనికి నియమిస్తుంది. వీరిద్దరూ ఆయుధాలను తమిళనాడు తరలించే విషయం ఎన్.ఐ.ఎ.కి తెలుస్తుంది. ఎన్‌ఐఏ చీఫ్ ప్రేమ్‌నాథ్ (బిజు మేనన్) ఎంతగా ప్రయత్నించినా.. ఆపలేకపోతాడు. ఫైనల్‌గా ఎన్ఐఏ టీమ్ అంతా.. ఈ ఆయుధాలు ఉన్న ప్రదేశాన్ని పేల్చేందుకు ఓ ఆపరేషన్ ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న రఘురామ్‌కు ఈ ఆపరేషన్ అప్పగిస్తారు. అసలు రఘురామ్‌కి ఈ ఆపరేషన్ ఎందుకు అప్పగించారు? ఆపరేషన్ సక్సెస్ అయిందా? అసలు రఘురామ్ ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి కారణం ఏమిటి? వంటి విషయాలకు సమాధానమే ‘మదరాసి’ సినిమా.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు