Lokah Chapter 1: దుల్కర్ సల్మాన్ నిర్మించిన మలయాళ సూపర్ హిట్ చిత్రం లోకా చాప్టర్ 1. ఈ సినిమా ఆగస్టు 28, 2025న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. రూ.30 కోట్ల కంటే తక్కువ బడ్జెట్‌తో నిర్మించబడింది కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి, అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం విజయం సాధించడంతో, దీనికి సీక్వెల్ కూడా ప్రకటించారు.
నటి నటులు
కళ్యాణి ప్రియదర్శన్ (చంద్ర – మహిళా సూపర్ హీరో), నస్లెన్ (సన్నీ), శాండీ మాస్టర్ (నచియప్ప గౌడ), అరుణ్ కురియన్, చందు సలీం కుమార్, నిశాంత్ సాగర్, విజయరాఘవన్ తదితర పాత్రల్లో నటించారు. ఇక అతిథి పాత్రల్లో టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ నటించారు.
లోకా చాప్టర్ 1 ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
రిలీజ్ అయి నెలలు దాటుతున్నా కూడా ఇంత వరకు ఏ OTT లోను విడుదల కాలేదు. అభిమానులు ఆ రోజు రిలీజ్ అవుతుంది.. ఈ రోజు రిలీజ్ అవుతుందని ట్విట్టర్‌లో పోస్టు లు పెట్టారు. ఇంకొందరూ ఇది అక్టోబర్ 2025లో విడుదల కావచ్చని అంటున్నారు. అయితే, ఇప్పుడు వారి అంచనాలే నిజమయ్యాయి. జియో హాట్‌స్టార్‌లో అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుందని అధికారికంగా ప్రకటించారు.
లోకా చాప్టర్ 1 ఓటీటీ ఆలస్యానికి ఇది కూడా ఒక కారణం?
ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి ఎందుకు లేట్ అయిందంటే.. దీనికి ఒక ప్రధాన కారణం ఉంది. లోకా చాప్టర్ 1 ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పెంచడం కోసం డిజిటల్ విడుదల వాయిదా వేయడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.
