Little Hearts OTT
ఎంటర్‌టైన్మెంట్

Little Hearts OTT: ‘లిటిల్ హార్ట్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. సర్‌ప్రైజ్ ఏంటంటే?

Little Hearts OTT: చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చి, ఘన విజయం సాధించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts). ఈ సెప్టెంబర్ నెలలో టాలీవుడ్‌కు మొదటి సక్సెస్‌ని ఇచ్చి, అందరికీ ఉత్సాహాన్ని ఇచ్చిన చిత్రంగా నిలవడమే కాకుండా, ప్రేక్షకులందరితోనూ యూనానిమస్‌గా బ్లాక్ బస్టర్ అని అనిపించుకుందీ చిత్రం. మహేష్ బాబు (Mahesh Babu), అల్లు అర్జున్ (Allu Arjun) మొదలుకుని బండ్ల గణేష్ వరకు ఎందరో సెలబ్రిటీలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రేక్షకులు, సెలబ్రిటీలు, విమర్శకులు అందరూ ఈ సినిమాకు జై కొట్టారు. ఇంకా ఈ సినిమా అక్కడక్కడా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూనే ఉంది. ఇక ఈ సినిమా ఓటీటీకి సంబంధించి ఇటీవల కొన్ని వార్తలు రాగా, చిత్ర బృందం వెంటనే ఖండించింది. థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న చిత్రాన్ని, ఇప్పుడప్పుడే ఓటీటీలోకి తీసుకురామని చాలా క్లారిటీగా చెప్పారు. మరి ఏమైందో, ఏమో.. అప్పుడు వినిపించిన డేట్ కంటే ముందే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Also Read- Nagababu: మా మనవడి రాక, ఓజీ గర్జన.. ఇక మా ఫ్యామిలీకి తిరుగులేదు

అక్టోబర్ 1కే..

మేకర్స్ తెలిపిన సమాచారం ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 2 కాదు, అక్టోబర్ 1 నుంచే ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. ‘లిటిల్ హార్ట్స్’ ఓటీటీ రిలీజ్ డేట్‌తో (Little Hearts OTT Release Date) పాటు మేకర్స్ మరో సర్‌ప్రైజ్ కూడా ఇచ్చారు. ఆ సర్‌ప్రైజ్ వింటే మళ్లీ.. ఈ సినిమాను చూసేందుకు జనాలు ఎగబడటం పక్కా అని చెప్పుకోవాలి. ఇంతకీ ఆ సర్‌ప్రైజ్ ఏమిటంటే.. ఓటీటీలో ఈ సినిమా అదనపు సన్నివేశాలతో రాబోతుంది. అవును, ఓటీటీలో ‘లిటిల్ హార్ట్స్’ చిత్రాన్ని ‘ఎక్స్‌టెండెడ్‌ కట్‌’‌తో స్ట్రీమింగ్‌కు తెస్తున్నామని మేకర్స్ ఈ ప్రకటనలో తెలియజేశారు. వాస్తవానికి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అక్టోబర్ 2 అంటూ ఒక వారం క్రితం వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై చిత్రయూనిట్ ఫన్నీగా స్పందించి, ఇప్పుడప్పుడే కాదని వివరణ ఇచ్చింది. కట్ చేస్తే.. ఇప్పుడు అక్టోబర్ 1కే ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.

Also Read- Balakrishna Controversy: బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి- అఖిల భారత చిరంజీవి యువత

భారీ లాభాలు

మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మించారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అయిన బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేశారు. ‘లిటిల్ హార్ట్స్’ సినిమా నిర్మాణానికి రూ. 2.5 కోట్ల బడ్జెట్ కాగా, ప్రమోషన్స్‌కు రూ. 1.5 కోట్లను ఖర్చు చేసినట్లుగా ఇటీవల ఓ ఈవెంట్‌లో నిర్మాత బన్నీ వాసు తెలిపారు. ఇప్పటి వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 35 ప్లస్ కోట్ల వసూళ్లను రాబట్టినట్లుగా తెలుస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Heroines: ఈ ఇద్దరు హీరోయిన్లు ఎంత దురదృష్టవంతులంటే..

Jubilee Hills Bypoll: బీజేపీలో ట్విస్ట్‌.. జూబ్లీహిల్స్ అభ్యర్థిని తానేనంటూ ప్రచారం.. లీడర్స్ షాక్!

Allu Arjun: ఐకాన్ స్టార్ సర్‌ప్రైజ్.. ‘ఓజీ’ చూసిన అల్లు అర్జున్.. వీడియో వైరల్!

Balineni: అది అవాస్తవం.. పవన్ కళ్యాణ్ సినిమాలపై చేసిన వ్యాఖ్యలకు బాలినేని క్లారిటీ!

New DGP: నిజమైన ‘స్వేచ్ఛ’ కథనం… తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి