Nagababu: మెగా బ్రదర్ నాగబాబు (Mega Brother Nagababu) సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రీసెంట్‌గా తనని తాతని చేసిన మనవడి గురించి, పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ (Pawan Kalyan OG) సక్సెస్ గురించి, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ గురించి, ‘ఓజీ’ చిత్ర బృందం.. ఇలా అన్నింటిని మిక్స్ చేస్తూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మరీ ముఖ్యంగా మా మనవడి రాక.. మాకు చీకటి నుంచి వెలుగును పంచిందని ఆయన ప్రస్తావించడం విశేషం. అసలు నాగబాబు తన పోస్ట్‌లో ఏం చెప్పారంటే..
Also Read- Madharaasi OTT: హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
బాలుడి ఆగమనం.. దైవేచ్ఛ
‘‘అదృష్టం, కృషి కలిసొచ్చే సమయం ప్రతి కుటుంబానికి ఏదో ఒక క్షణం వస్తుంది. తన నిష్కల్మషమైన తేజస్సుతో మా మనవడు.. మా కుటుంబాన్ని చీకటి నుంచి వెలుగులోకి పయనించేలా మార్చాడు. మా నాయకుడు, మా సోదరుడు పవన్ కళ్యాణ్, అసాధారణ కృషితో, ఎప్పుడూ ఉన్నత శిఖరంలో నిలబడతారు. కొన్నిసార్లు దైవ సంకల్పం కూడా తోడవుతుంది. బాలుడి ఆగమనం.. దైవేచ్ఛ. ఇప్పుడు ‘ఓజీ’ (OG) గర్జిస్తోంది, ఒక సూపర్ హిట్ జ్వాలగా మారుతోంది. పాత లయను మార్చి, సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. ఈ విజయ పరంపర వెనుక, మాకు మార్గదర్శి అయిన అన్నయ్య చిరంజీవి (Megastar Chiranjeevi) ఆశీస్సులు కనిపిస్తున్నాయి. చరణ్, తేజ్, వైష్ణవ్, వరుణ్.. వీరంతా మా ఆకాశంలో మెరిసే తారలు. ఆత్మీయత నుంచి విజయ పరంపర వరకు, ప్రేమ నుంచి గాథల వరకు, మా మెగా కుటుంబం (Mega Family) ఉన్నతంగా ఎదగడం మొదలైంది. ఈ కార్డు మాకు ఒక వరంగా, ప్రమాణంగా, గీతంగా నిలుస్తుంది. మా వారసత్వపు విజయ పరంపర బలంగా కొనసాగుతుంది.
Also Read- Balakrishna Controversy: బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి- అఖిల భారత చిరంజీవి యువత
‘OG’ బృందానికి శుభాకాంక్షలు
ఈ భూకంపం వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన ‘OG’ బృందానికి హృదయపూర్వక అభినందనలు! దర్శకుడు సుజీత్ (Sujeeth)కు ప్రత్యేక ప్రశంసలు. మీరు నిజమైన అభిమానిగా, ప్రతి సహ-అభిమాని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కలను నిజం చేశారు. ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్, పవన్ కళ్యాణ్ పరాక్రమాన్ని, ఉత్సవాన్ని అద్భుతంగా చూపించాయి. తమన్ (Thaman) మీరు అసాధారణమైన పని చేశారు. మీ నేపథ్య సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు.. నిజంగా గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. మీరు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. కెమెరామెన్స్ రవి.కె. చంద్రన్, మనోజ్ పరమహంసలకు ఘన విజయాభిందనలు. పవన్ కళ్యాణ్‌ను మునుపెన్నడూ చూడని విధంగా, అద్భుతమైన ఫ్రేములతో, గ్రాండ్ విజువలైజేషన్‌తో, ఉత్కంఠభరితమైన చిత్రీకరణతో ఎలివేట్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ చారిత్రాత్మక ప్రాజెక్ట్‌ను వెన్నుదన్నుగా నిలిచిన నిర్మాత దానయ్య, కళ్యాణ్ దాసరిలకు మా అభినందనలు. ఇంకా ఈ సినిమాలో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు’’ అని నాగబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇప్పుడీ పోస్ట్ వైరల్ అవుతోంది.
In every clan, a moment arrives When effort meets destiny, and the streak revives.
My grandson, with his innocent spark, Turned our path from shadow to mark.
My brother, our leader, @PawanKalyan stood tall with grace, His efforts unmatched, his heart in place.
Yet sometimes, fate… pic.twitter.com/DDIf8vAQ2D— Naga Babu Konidela (@NagaBabuOffl) September 26, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు