Little Hearts: ఇటీవల విడుదలైన ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts Movie) చిత్రం. చిన్న చిత్రంగా కేవలం రూ. 2.5 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5 థియేటర్లలో విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు స్టార్స్ ఎందరో సపోర్ట్ చేస్తుండటం విశేషం. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోస్, హీరోయిన్స్.. ఇలా అన్ని క్రాఫ్ట్స్ నుంచి స్టార్స్ ఎందరో ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వారు ప్రశంసలు కురిపిస్తున్నారనే కాదు.. ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలైన మొదటి రోజు, మొదటి ఆట నుంచే ఈ సినిమాకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఆట ఆటకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి తప్పితే తగ్గలేదు. ఈ శుక్రవారం వచ్చిన రెండు సినిమాలు ‘మిరాయ్’, ‘కిష్కింధపురి’ మంచి స్పందనను రాబట్టుకున్నాయి కాబట్టి.. ఆ ఎఫెక్ట్ ఈ సినిమాపై పడే అవకాశం ఉంది కానీ, గురువారం వరకు ఈ సినిమా థియేటర్లలో రఫ్ ఆడించిందనే చెప్పుకోవాలి.
Also Read- Kishkindhapuri: ‘ఓజీ’ వచ్చే వరకు.. ‘కిష్కింధపురి’ రెస్పాన్స్‌పై టీమ్ రియాక్షన్ ఇదే!
ఫస్ట్ టైమ్ స్టార్స్ సపోర్ట్
‘లిటిల్ హార్ట్స్’ సినిమా విషయంలో ఒక్క మాట చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో ఎందరో సెలబ్రిటీల ప్రశంసలు అందుకున్న చిత్ర ఏదైనా ఉందీ అంటే అది కేవలం ‘లిటిల్ హార్ట్స్’ మాత్రమే. ఈ సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజా రవితేజ, నాని, విజయ్ దేవరకొండ, నాగచైతన్య వంటి ఎందరో హీరోలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. ఒక్క హీరోలు మాత్రమే కాదు.. పలువురు పేరున్న దర్శక నిర్మాతలు కూడా ఈ సినిమా చాలా బాగుందంటూ, ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదంటూ పోస్ట్ చేయడం విశేషం. క్రికెటర్ హనుమ విహారి కూడా ఈ సినిమాపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చిన్న చిత్రానికి స్టార్స్ ఇంతగా సపోర్ట్ చేసేందుకు ముందుకు రావడం అంటే.. ఇది చాలా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ సంప్రదాయం కనుక ఇలాగే కొనసాగితే కంటెంట్ ఉన్న మరిన్ని మంచి చిత్రాలు విజయాన్ని అందుకుంటాయనడంలో అతిశయోక్తి లేనే లేదు. తాజాగా ఈ చిత్ర టీమ్‌ను ఇంటికి పిలిపించుకుని మరీ అభినందించారు హీరో విజయ్ దేవరకొండ. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read- Pawan Kalyan: కళలు లేని సమాజంలో హింస ప్రబలే అవకాశం ఉంది.. పవన్ సంచలన నిర్ణయం
భారీగా లాభాలు
ఈ సినిమా డబుల్ కాదు.. త్రిబుల్ రెట్లు లాభాలను మేకర్స్ అందించినట్లుగా ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన నిర్మాతలలో ఒకరైన బన్నీ వాస్ మాట్లాడుతూ.. చిత్ర బడ్జెట్, ప్రమోషన్స్ కలిపి దాదాపు రూ. 4 కోట్లు అయినట్లుగా చెప్పుకొచ్చారు. కలెక్షన్ల పరంగా రూ. 25 కోట్లు క్రాస్ చేసిందని, రూ. 30 కోట్లకు చేరువలో ఉందని ప్రకటించారు. అంటే, ఈ సినిమా మేకర్స్‌కు ఎంత లాభాన్ని తెచ్చిపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించగా, ఆదిత్య హాసన్ నిర్మించారు. బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు