Kishkindhapuri
ఎంటర్‌టైన్మెంట్

Kishkindhapuri: ‘ఓజీ’ వచ్చే వరకు.. ‘కిష్కింధపురి’ రెస్పాన్స్‌పై టీమ్ రియాక్షన్ ఇదే!

Kishkindhapuri: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) హీరోగా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించగా, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ప్రీమియర్స్‌తో మొదలై.. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంటోంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని మేకర్స్ తమ ఆనందాన్ని తెలియజేసేందుకు మీడియా సమావేశం (Kishkindhapuri Thanks Meet) నిర్వహించారు.

Also Read- Pawan Kalyan: కళలు లేని సమాజంలో హింస ప్రబలే అవకాశం ఉంది.. పవన్ సంచలన నిర్ణయం

‘ఓజీ’ వచ్చేంతవరకు

ఈ కార్యక్రమంలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో చాలా సంతోషంగా ఉంది. గురువారం మూడు ప్రీమియర్ షోలు వేద్దామనుకుని మొదలు పెడితే.. మా సినిమాకు 66 షోలు పడ్డాయి. ఆర్గానిక్‌గా మా సినిమా ఆడియన్స్‌కు రీచ్ అయినందుకు మేమంతా హ్యాపీగా ఉన్నాం. ఆడియన్స్ మా సినిమాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణ అంతా ఇంతా కాదు. చాలా జెన్యూన్‌గా ఈ ప్రేమను సంపాదించాం. తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పోళ్ళు, దేవుళ్ళు. తెలుగు ప్రేక్షకుల వంటి వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమానైనా సక్సెస్ చేస్తారు. ఒక కొత్త జోనర్, ఒక కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని ఈ సినిమా కోసం ఎంతగానో కృషి చేశాం. దీనికి నిర్మాత సాహు ఇచ్చిన సపోర్ట్ మరిచిపోలేనిది. ఈ సినిమా ఖచ్చితంగా చాలా మంచి రేంజ్‌కి వెళుతుందని నమ్ముతున్నాము. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. తను చాలా గొప్ప స్థాయికి వెళ్లబోతున్నారు. ఈ సినిమాను థియేటర్లో చూసిన ప్రతి ఒక్కరూ చాలా గొప్పగా రియాక్ట్ అవుతున్నారు. ఇది అందరికీ నచ్చే సినిమా. పవర్ స్టార్ ‘ఓజీ’ వచ్చేంతవరకు మా సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూనే ఉంటుంది. 1400 మంది క్రౌడ్‌తో సినిమా చూశాను.. రెస్పాన్స్ మామూలుగా లేదు. ఇది ప్రేక్షక దేవుళ్ళని మెప్పించే సినిమా. అందరూ ఈ సినిమాను చూసి ఎలా ఉందో జెన్యూన్‌గా చెప్పాలని కోరుతున్నానని చెప్పుకొచ్చారు.

Also Read- Mega158 and NBK111: దసరాకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్న టాలీవుడ్ టాప్ హీరోస్.. ఫ్యాన్స్‌కు పండగే

డబుల్ ఇంపాక్ట్ రెస్పాన్స్

నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. సినిమాను సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యూ. మీడియా ఈ సినిమాను ప్రేక్షకులకు దగ్గరకు తీసుకెళ్లింది. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఆడియన్స్ వరకు.. చూసిన అందరి నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. మేము అనుకున్న దాని కంటే డబుల్ ఇంపాక్ట్ రెస్పాన్స్ వస్తుంది. ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ఫోన్ చేసి.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మా బ్యానర్‌లో చాలా మంచి సినిమా పడింది. మా హీరో సాయి, డైరెక్టర్ కౌశిక్, హీరోయిన్ అనుపమ, ఇంకా సినిమాకు పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. వారి సహకారంతోనే ఇంత పెద్ద సక్సెస్ సాధించగలిగాము. ఇది నాకు వెరీ ప్రౌడ్ మూమెంట్.. అని అన్నారు. ‘ఫస్ట్ టైం హిట్ కొట్టినప్పుడు ఆ మూమెంట్ జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ మూమెంట్‌ని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఈ మూమెంట్ ని ఎప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటాను’ అని అన్నారు దర్శకుడు కౌశిక్. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ తన సంతోషాన్ని తెలియజేశారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ambedkar University: అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు

New Train Service: అందుబాటులోకి కొత్త రైల్వే లైన్.. పచ్చజెండా ఊపనున్న ప్రధాని మోదీ

Anupama Parameswaran: థియేటర్లలోకి ‘కిష్కింధపురి’.. సైలెంట్‌గా ఓటీటీలోకి మరో సినిమా!

Hyderabad Crime News: రేణు అగర్వాల్ హత్య కేసులో.. కీలక ఆధారాలు వేలుగులోకి?.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

BRAOU Admissions: అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు