Laxmi Raai: లక్ష్మీరాయ్ తెలుగు ప్రేక్షకులకే కాదు, బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. కోలీవుడ్ సినిమాతో అరంగేట్రం చేసిన లక్ష్మీరాయ్ (Laxmi Raai).. ఆ తర్వాత ‘కాంచనమాల కేబుల్ టీవీ’ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేశారు. సౌత్‌లో నటిగానే కాకుండా స్పెషల్ సాంగ్స్ చేస్తూ.. రత్తాలుగా ప్రేక్షకులలో గుర్తింపు పొందిన లక్ష్మీరాయ్.. హీరోయిన్‌గానూ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. రీసెంట్‌గా ఆమె నటించిన ‘జనతా బార్’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలై మంచి స్పందననే రాబట్టుకుంది. అశ్వర్థ నారాయణ సమర్పణలో రోచిశ్రీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ‘జనతా బార్’ (Janata Bar) చిత్రానికి రమణ మొగిలి (Ramana Mogili) దర్శక, నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు కేరళ, హిందీ ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది.
Also Read- Telugu Releases: ఈ వారం థియేటర్‌లో విడుదలవుతున్న తెలుగు సినిమాలు ఇవే.. ఎంటర్‌టైన్మెంట్ లోడింగ్..
రత్తాలుకి అక్కడ బ్రేక్ వస్తుందా?
లక్ష్మీరాయ్‌కి ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌లో కూడా సరైన సినిమా పడలేదు. ‘జనతా బార్’ చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటించడంతో.. ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తుందని భావించిన టీమ్, అక్కడ రిలీజ్‌కు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే కేరళతో పాటు హిందీలో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు భాషల్లో కూడా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న తర్వాతే సినిమా ఓటీటీకి వస్తుందని తాజాగా మేకర్స్ తెలియజేశారు. దీంతో, చాలా కాలంగా బాలీవుడ్‌లో సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న లక్ష్మీరాయ్‌కి ఈ సినిమా కచ్చితంగా మంచి బ్రేక్ ఇస్తుందని, ఆమె అభిమానులు నమ్ముతున్నారు. ఈ సినిమాలో లక్ష్మీరాయ్ గ్లామర్ ప్రదర్శనతో పాటు యాక్షన్‌లోనూ సత్తా చాటిన విషయం తెలిసిందే.
Also Read- Yadhu Vamsee: క్యాస్టింగ్ కాల్.. ‘కమిటీ కుర్రోళ్లు’ దర్శకుడికి అచ్చమైన తెలుగమ్మాయ్ కావాలట!
స్పోర్ట్స్, రివేంజ్ డ్రామా
స్పోర్ట్స్, రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో అమీక్షా పవర్, అమన్ ప్రీత్ సింగ్, దీక్షా పంత్, శక్తి కపూర్, అనూప్ సోనీ, ప్రదీప్ రావత్, సురేష్, వంటివారు ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. క్రీడల్లో మహిళలపై జరిగే వేధింపులు, ఎదురయ్యే చేదు అనుభవాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. తన సోదరికి జరిగిన అన్యాయాన్ని బయట పెట్టి, ప్రతీకారం తీర్చుకునే రివేంజ్ డ్రామాగా ‘జనతా బార్’ చిత్రం రూపుదిద్దుకుంది. వాస్తవ ఘటనలకు అద్దం పట్టేలా ఉన్న ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం దక్కించుకుంది. ఈ మూవీకి వినోద్ యజమాన్య (Vinod Yagamanya) అందించిన సంగీతం మరో ప్రధాన ఎస్సెట్‌గా నిలిచింది. త్వరలోనే ‘జనతా బార్’ మూవీ బాలీవుడ్ రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు. ఈ విడుదలకు సంబంధించిన మరిన్ని వివరాలను అతి త్వరలోనే తెలియజేస్తామని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

