Lavanya Controversy: హైడ్రామా అనంతరం.. లావణ్యకు షాక్!
Lavanya and Raj Tarun Parents
ఎంటర్‌టైన్‌మెంట్

Lavanya Controversy: హైడ్రామా అనంతరం.. లావణ్యకు షాక్!

Lavanya Controversy: రాజ్ తరుణ్ – లావణ్యల కాంట్రవర్సీ మరోసారి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గతేడాది వారి ప్రేమ, పెళ్లి వ్యవహారంతో పాటు డ్రగ్స్ విషయంలోనూ వీరి పేర్లు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇంటి విషయంలో వారి పేర్లు వైరల్ అవుతూ, ఇండస్ట్రీలో రచ్చ రచ్చ అవుతుంది. రాజ్ తరుణ్ పేరెంట్స్, ఆయన ఇంటికి వెళ్లగా.. అక్కడే ఉంటున్న లావణ్య వారిని బయటకు గెంటేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వ్యవహారం తేల్చే పనిలో ఉన్నారు. బుధవారం రాత్రంతా జరిగిన హైడ్రామా తర్వాత లావణ్యకు షాక్ ఇస్తూ.. రాజ్ తరుణ్ పేరెంట్స్‌ (Raj Tarun Parents)ని లావణ్య ఉంటున్న ఇంటిలోకి పోలీసులు పంపించారు. పోలీసులు ఈ విషయంలో లావణ్యతో మాట్లాడి, ఇంటి బయట ధర్నా చేస్తున్న రాజ్ తరుణ్ (Raj Tarun) పేరెంట్స్‌ని ఇంటిలోకి పంపించారు. ఆ తర్వాత లావణ్య మీడియాతో మాట్లాడుతూ..

Also Read- Soundarya: సౌందర్య చనిపోతుందని ఆయనకు ముందే తెలుసా?

ఎవరో రానివ్వడం కాదు.. నిన్న అందరూ వెళ్లిపోయిన తర్వాత నేను వారిని లోనికి తీసుకువచ్చాను. వారు ఎంత కాదనుకున్నా, నాకు అత్తమామలు. అంతా వెళ్లిపోయిన తర్వాత వారితో మాట్లాడటానికి 5 నిమిషాలు కూడా పట్టలేదు. చూస్తుంటే, ఇదంతా మా మంచికే జరుగుతుందని అనిపిస్తుంది. ఇప్పుడు అత్తమామలు వచ్చారు, రేపు రాజ్ తరుణ్ కూడా నా దగ్గరకు రావచ్చు. వాళ్లు ఎలా అయితే ఇంటి మీద హక్కు ఉందని వచ్చారో.. నాకు కూడా రాజ్‌పై హక్కు ఉందనేలా చేశారు. ఈ విషయంలో చట్టానికి, మీడియాకు థ్యాంక్స్ చెబుతున్నా. అయితే నిన్న బుధవారం జరిగిన విధ్వంసం వెనుక రాజ్ తరుణ్ ఉన్నాడా? లేదంటే ఆయన తల్లిదండ్రులేనా? అనేది మాత్రం పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తెలుస్తుంది.

రాజ్ తరుణ్ పేరేంట్స్ ఆ అమ్మాయి మా కోడలు కాదని అంటున్నారు కదా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. మరి ఎందుకు ఇక్కడకు వచ్చారు. 2014లో మాకు పెళ్లి అయింది. ఆ తర్వాత మనవల్ని ఇవ్వండి అంటూ మా ఇద్దరిని రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆశీర్వదిస్తూనే వస్తున్నారు. ఈ ఇల్లు కూడా అతనిది, వారిది కాదు.. మా అందరి ఇల్లు. రాజ్ తరుణ్ పేరేంట్స్‌ది కూడా కాదు.. నాది, రాజ్ తరుణ్‌ది మాత్రమే ఈ ఇల్లు. 20 రోజుల క్రితం నేనే రాజ్ తరుణ్ పేరెంట్స్‌తో మాట్లాడి, ఇక గొడవలు వద్దు, మీరు వచ్చేయండి అని చెప్పాను. నాకు కొంచెం టైమ్ ఇవ్వమ్మా.. అన్ని సెట్ చేసి వస్తానని చెప్పిన వారు, సడెన్‌గా బుధవారం 15 మందితో వచ్చి దాడి చేయడం ఏమిటో నాకు అర్థం కాలేదు. గతంలో జరిగిన దానికి నేను వారందరికీ సారీ చెప్పాను.

Also Read- Trinadha Rao Nakkina: ‘మజాకా’ ఎఫెక్ట్ బాగానే పడింది.. చేతులెత్తి నమస్కరించాడు

ఇక కేసులు అంటారా? రాజ్ తరుణ్ నా దగ్గరకు వస్తే.. ఆయనపై ఎటువంటి కేసులు ఉండవు. రాని పక్షంలో నాకు అన్యాయం చేసినట్టేగా? ఆయనకే కాదు, నాకు కూడా ఎన్నో ఆశలు ఉన్నాయి. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నా. అమ్మాయిల వెంట పడి కెరీర్ పాడు చేసుకుంటున్న టైమ్‌లో.. నా కలలను పక్కన పెట్టి, రాజ్ తరుణ్‌ కెరీర్‌ని నిలబెట్టేందుకు ఎంతగానో ప్రయత్నించాను. అది రాజ్ తరుణ్‌కి కూడా తెలుసు. మరి నన్ను వదిలించుకోవాలని ప్లాన్ చేశాడో? లేదంటే నాపై వచ్చిన ఆరోపణలతో ప్లాన్ చేశాడో తెలియదు కానీ, నాకు అన్యాయం చేయాలని మాత్రం చూస్తున్నాడు. అందుకు నేను ఒప్పుకోను. ఎంత వరకైనా ఫైట్ చేస్తానని లావణ్య చెప్పుకొచ్చింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..