Soundarya: సౌందర్య.. ఈ పేరు తెలుగు చలనచిత్ర పరిశ్రమ, కాదు కాదు సినీ పరిశ్రమ ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోయే పేరు. సినిమా ఇండస్ట్రీలో అలాంటి స్థానాన్ని సౌందర్య తన నటనతో సాధించుకున్నారు. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా, నిండైన చీరకట్టుతో పదహారణాల తెలుగమ్మాయిగా కనిపించి ఎందరో హీరోయిన్లకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు. దాదాపు పదేళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని స్టార్‌డమ్‌ని చూసిన సౌందర్య, దురదృష్టవశాత్తు 2004, ఏప్రిల్ 17న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసి అభిమానులను, ప్రేక్షక ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేశారు. అయితే, సౌందర్య పదేళ్ల స్టార్‌డమ్ తర్వాత భారీ ప్రమాదానికి గురవుతుందని ఒకరికి ముందే తెలుసంట. ఆ ఒకరు ఎవరో కాదు సౌందర్య తండ్రి కెఎస్ సత్యనారాయణ.
Also Read- Trinadha Rao Nakkina: ‘మజాకా’ ఎఫెక్ట్ బాగానే పడింది.. చేతులెత్తి నమస్కరించాడు
సౌందర్య చనిపోయి 21 ఏళ్లు అవుతున్నా, ఇప్పటికీ ఆమె పేరు సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటుంది. ఎవరైనా హీరోయిన్ చక్కగా చీరకట్టుకుంటే చాలు, సౌందర్యలా ఉన్నావంటూ వర్ణిస్తుంటారు. ఎవరైనా హీరోయిన్ పద్ధతిగా కనిపిస్తే చాలు, హీరోయిన్ సౌందర్య (Heroine Soundarya)లా ఈ అమ్మాయి కూడా అశ్లీలతకు తావివ్వకుండా చక్కటి పాత్రలు చేస్తుందని అంటుంటారు. అలా ఏదో ఒక రూపంలో సౌందర్య పేరు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు కూడా తమ ఆడపిల్లల్ని సౌందర్యలా అందంగా ఉండాలి, ఉంచాలనేలా ఊహించుకుంటూ ఉంటారు. అలా ఉంటుంది సౌందర్య కట్టు, బొట్టు.
మరి అలాంటి సౌందర్య చనిపోయినప్పుడు ప్రేక్షక ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయిందనడంలో అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పటికీ సౌందర్య మరణంపై రకరకాలు వార్తలు, అనుమానాలు వినబడుతూనే ఉంటాయి. వాటిని పక్కన పెడితే.. సౌందర్య చనిపోతుందని తన తండ్రికి ముందే ఎలా తెలిసిందనే పాయింట్ విషయానికి వస్తే.. సౌందర్య సినీ ఎంట్రీ ఇవ్వకముందే సౌందర్య తండ్రి (Soundarya Father) కెఎస్ సత్యనారాయణ ఆమె జాతకాన్ని చూపించారట. ఆమె జాతకం గురించి తెలిసి, ఆయన ఆశ్చర్యపోయారట. ఆమె జాతకం ప్రకారం..
Also Read- Gaddar Awards: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్‌గా జయసుధ.. నామినేషన్స్ వివరాలివే!
సినిమా రంగంలోకి అడుగు పెడితే తిరుగులేని హీరోయిన్‌గా ఎదుగుతుందని, ఎనలేని కీర్తిని గడిస్తుందని ఆమె జాతకంలో ఉందట. కాకపోతే కేవలం పది సంవత్సరాలు మాత్రమే ఆమె సినీ రంగంలో ఉంటుందని, ఆ తర్వాత పెను ప్రమాదానికి గురవుతుందని జ్యోతిష్యుడు అప్పట్లో చెప్పారట. నిజంగా ఆయన చెప్పినట్లుగానే సౌందర్యకు జరిగింది. నటిగా ఎనలేని స్టార్‌డమ్‌ని, కీర్తిని అనుభవించిన సౌందర్య, సరిగ్గా పదేళ్ల సినీ కెరీర్ తర్వాతే పెను ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్నారు. జ్యోతిష్యాన్ని కొందరు నమ్మరు, కానీ సౌందర్య విషయంలో అది నమ్మాలి అనేంతగా ఆమె మృతి అందరినీ కలిచివేసింది.
ఇక సౌందర్య చనిపోయే కొన్ని నిమిషాల ముందు తన మేనకోడలికి ఫోన్ చేసి తనకు కొన్ని కాటన్ చీరలు, వాటితో పాటు కుంకుమ కావాలని కోరారట. ఈ విషయం కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది. ఏదిఏమైనా సౌందర్య భౌతికంగా దూరమైనా, తన నిండైన కట్టు, బొట్టుతో ఇప్పటికీ ఎందరో ఆడపిల్లలకు రోల్ మోడల్‌గా నిలుస్తూనే ఉన్నారు. నేడు (ఏప్రిల్ 17) ఆమె వర్ధంతి (Soundarya Death Anniversary). ఈ సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుని, మనస్ఫూర్తిగా నివాళులు అర్పిద్దాం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు