Chaurya Paatam Trailer Launch event
ఎంటర్‌టైన్మెంట్

Trinadha Rao Nakkina: ‘మజాకా’ ఎఫెక్ట్ బాగానే పడింది.. చేతులెత్తి నమస్కరించాడు

Trinadha Rao Nakkina: ‘ధమాకా’ దర్శకుడు త్రినాథరావు నక్కిన నుంచి రీసెంట్‌గా వచ్చిన సినిమా ‘మజాకా’ (Mazaka) అనుకున్నంతగా సక్సెస్ కాలేదనే విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ముందు భారీగా అంచనాలు అయితే ఏర్పడ్డాయి కానీ, ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా ఫెయిలైంది. దీంతో సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదంటూ తాజాగా జరిగిన ‘చౌర్య పాఠం’ (Chaurya Paatam) ట్రైలర్ లాంచ్ వేడుకలో దర్శకుడు త్రినాథరావు నక్కిన చెప్పుకొచ్చారు. సినిమా పరాజయాన్ని ప్రేక్షకుల అకౌంట్‌లో వేసేసి, తనదేం లేదన్నట్లుగా ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

Also Read- Gaddar Awards: గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్‌గా జయసుధ.. నామినేషన్స్ వివరాలివే!

త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం ‘చౌర్య పాఠం’. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాతో హీరోగా ఇంద్రా రామ్‌ని, దర్శకుడుగా నిఖిల్ గొల్లమారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు త్రినాథరావు నక్కిన. ఈ సమ్మర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్షన్‌గా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఈవెంట్‌లో త్రినాథరావు నక్కిన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..

‘‘కారణాలు ఏమైనా ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు థియేటర్స్‌కి రావడం తగ్గింది. ఇలాంటి టైమ్‌లో అంతా కొత్తవారితో సినిమా చేయడం అంటే సాహసంతో కూడుకున్న విషయం. అలాంటి సాహసం ఈ ‘చౌర్య పాఠం’ సినిమాతో నేను చేశాను. ఈ సినిమా చేస్తున్నప్పుడు నిర్మాతలకు ఉండే కష్టాలేంటో నాకు బాగా అర్థమయ్యాయి. ఈ సినిమా తర్వాత నాకు నిర్మాతలపై విపరీతమైన గౌరవం పెరిగింది. మౌత్ పబ్లిసిటీ‌పై ఉన్న నమ్మకంతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. నేను చేసిన ‘మేము వయసుకు వచ్చాం’ సినిమా లిమిటెడ్ థియేటర్స్‌లో విడుదలై చాలా పెద్ద విజయం సాధించింది. ఆ నమ్మకమే మాకు ఈ సినిమాపై కూడా ఉంది.

Also Read- Pooja Hegde: వారంతా నా సినిమాలు చూడరు, నా ఫ్యాన్స్ కూడా అయ్యిండరు!

ప్రేక్షకులని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి అందరూ ఈ సినిమా చూడండి. సినిమా కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అసలు క్రైమ్ లేని ఊరు, ఒక్క కేసు కూడా ఫైల్ అవ్వలేదు. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. దాన్ని బేస్ చేసుకుని ఒక కథ చేశాం. ‘చౌర్య పాఠం’ అంటే దొంగతనం చేయడానికి ట్రిక్కులు కాదు. ఒక అవసరం కోసం ఒక దొంగతనం చేయాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్‌లో ఒక పాఠం నేర్చుకుంటాడు. ఒక టన్నెల్ తవ్వి దాని గుండా వెళ్లే క్రమంలో జరిగే కథ ఇది. ఇది టెక్నికల్‌గానూ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. దీనికి అద్భుతమైన లవ్ స్టోరీని యాడ్ రాసాడు నిఖిల్. ప్రేక్షకులందరికీ చేతులెత్తి నమస్కరించి మరీ అడుగుతున్నాను. ఈ సినిమా కోసం దయచేసి థియేటర్స్‌కి రండి. థియేటర్స్‌లోనే చూడండి. నచ్చితే నలుగురికి చెప్పండి. మీరు సినిమా చూస్తేనే మేము సినిమా తీయగలం. మీరంతా ఫ్యామిలీస్‌తో రండి. హ్యాపీగా చూడండి’’ అని చెప్పుకొచ్చారు.

ఇక త్రినాథరావు నక్కిన మాటలు విన్నవారంతా, తన సొంత సినిమా అయ్యే సరికి ప్రేక్షకులను ఎలా తన సినిమా చూడమని అంటున్నాడో చూడండి. ‘మజాకా’ వంటి తను డైరెక్ట్ చేసిన సినిమాలను మాత్రం ప్రేక్షకుల రమ్మని అడగలేదు. ఇప్పుడు చూడండి ఎలా వేడుకుంటున్నాడో. ఎంతైనా రూపాయి పెడితేనే కదా బాధ్యత తెలిసేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!