Pooja Hegde
ఎంటర్‌టైన్మెంట్

Pooja Hegde: వారంతా నా సినిమాలు చూడరు, నా ఫ్యాన్స్ కూడా అయ్యిండరు!

Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే తెలుగు ప్రేక్షకులను పలకరించి చాలా కాలమే అవుతుంది. ప్రస్తుతం ఆమె దృష్టి మొత్తం బాలీవుడ్‌పైనే ఉంది. ఒకప్పుడు టాలీవుడ్‌ (Tollywood)లో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని అనుభవించిన పూజాకు ప్రస్తుతం అవకాశాలే లేవు. అవకాశాలు లేకపోవడంతో కోలీవుడ్, బాలీవుడ్ అంటూ పక్కదారి పట్టింది. కోలీవుడ్‌, బాలీవుడ్‌లో ఈ బుట్టబొమ్మ బిజీగానే ఉంటోంది. టాలీవుడ్‌లో అవకాశాలు రాకుండా పోవడానికి ఆమెకేం పెద్దగా ఫ్లాపులు కూడా లేవు. ఫ్లాప్స్ వచ్చినా, ఆమె నటించేది స్టార్ హీరోల సినిమాలలోనే కాబట్టి, అది వారి కేటగిరీలలోకే పోతుంది. మరెందుకు ఆమెకు అవకాశాలు రావడం లేదు అనేలా ఆమె ఫ్యాన్స్ కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read- Hari Hara Veera Mallu: ఆకాశాన్నంటేలా చేస్తున్నారు.. తుస్సుమనిపిస్తున్నారు

ఈ నేపథ్యంలో ఆమెపై కొన్ని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వరుస సక్సెస్‌లతో దూసుకెళుతున్న మరో నటి కంటే ఎక్కువ పారితోషికం ఇస్తేనే సినిమాలు చేస్తానని మొండికేసుకుని కూర్చుందట. అందుకే ఆమెను తెలుగు దర్శకనిర్మాతలు పక్కన పెట్టేశారనేలా టాక్ నడుస్తుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది పూజాకే తెలియాలి. అన్నట్టు, ఇప్పుడు టాలీవుడ్‌లో ఆమెకు ఓ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ రానుందని అంటున్నారు. అది కూడా ఓ యంగ్ హీరో సినిమాలో అని అంటున్నారు. అనౌన్స్‌మెంట్ వస్తేగానీ, ఆ హీరో ఎవరో తెలియదు. ఇదిలా ఉంటే,

తాజాగా ఈ భామ సోషల్ మీడియా ఫాలోయర్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సెలబ్రిటీలను ఫాలో అయ్యే ఫాలోయర్స్ అందరూ థియేటర్లకు వెళ్లి వారి సినిమాలను చూడరని చెప్పింది. సోషల్ మీడియా ఫాలోయర్స్‌కు, థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే వారికి చాలా తేడా ఉంటుందని పేర్కొంది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘ఇన్‌స్టాలో నన్ను దాదాపు 27 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. వారంతా నా సినిమాలు చూసేందుకు థియేటర్లకు రారు. అలాగే నన్ను ఫాలో అయ్యే వారంతా నా అభిమానులని కూడా చెప్పలేం. ఇంకా వివరంగా చెప్పాలంటే, సూపర్ స్టార్లకు సోషల్ మీడియాలో 5 మిలియన్లు, అంతకంటే తక్కువ మందే ఫాలోయర్స్ ఉంటారు. కానీ, వారి సినిమా విడుదలైతే కోట్లాది మంది థియేటర్లకు వస్తుంటారు. కాబట్టి ఫాలోయర్స్ ఎక్కువ ఉన్నంత మాత్రాన వారంతా మన కోసం థియేటర్లకు వచ్చి సినిమాలను సక్సెస్ చేస్తారని అనుకోలేం’ అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.

Also Read- Raj Tarun- Lavanya: రాజ్ తరుణ్ పేరెంట్స్‌ని గెంటేసిన లావణ్య.. మళ్లీ మొదలు!

నిజమే మరి.. ఆమె చెప్పిన దానిలో వాస్తవం ఉందని నెటిజన్లు ఊ కొడుతున్నారు. ఎందుకంటే, రజినీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి హీరోలకు పెద్దగా ఫాలోయర్స్ ఉండరు. కానీ వారి సినిమాలు విడుదలవుతున్నాయంటే, విడుదలకు వారం ముందు నుంచే థియేటర్ల వద్ద సందడి నెలకొంటుంది. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అందరూ వారి సినిమాలను చూసేందుకు క్యూ కడుతుంటారు. అలా చూస్తే, పూజా చెప్పింది నిజమే అని ఒప్పుకోక తప్పదు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ