Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా పీరియాడిక్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా ఇప్పటికే పలు మార్లు వాయిదా పడింది. అందుకు కారణం ఏమిటో కూడా అందరికీ తెలుసు. కేవలం పవన్ కళ్యాణ్ కారణంగానే ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండటంతో, చేస్తున్న సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. నిర్మాతలు కూడా ఏమీ చేయలేక, రిలీజ్ డేట్స్ ప్రకటించడం, ఆ తర్వాత వాయిదా వేసుకోవడం వంటివి చేస్తూ వస్తున్నారు. ‘హరి హర వీరమల్లు’ సంగతే ఇట్టా ఉంటే.. ఇక ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
Also Read- Raj Tarun- Lavanya: రాజ్ తరుణ్ పేరెంట్స్‌ని గెంటేసిన లావణ్య.. మళ్లీ మొదలు!
‘హరి హర వీరమల్లు’ సినిమాకు సంబంధించి మాత్రం విడుదల తేదీ అని చెప్పిన ప్రతిసారి అంచనాలు ఆకాశాన్ని అంటేలా హడావుడి చేస్తున్నారు. కొత్త పోస్టర్ వదులుతున్నారు. కానీ రెండు మూడు రోజులు పూర్తవ్వగానే ఆ హడావుడి మొత్తం తుస్సుమంటుంది. కారణం, ఆ పోస్టర్ మీద ఉన్న డేట్‌కి ఈ సినిమా వస్తుందో, రాదో అనేలా అనుమానాలు మొదలు. ఈ విధంగా ఇప్పటికి పలుమార్లు జరుగుతూ వస్తుంది. ఇప్పుడు కూడా మేకర్స్ ఈ సినిమా మే 9న విడుదల అని ప్రకటించారు. కానీ, మరోసారి వాయిదా తప్పదు అనేలా వార్తలు మొదలయ్యాయి.
ఇంకా పవన్ కళ్యాణ్ చేయాల్సిన షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. వారు చెప్పిన విడుదల తేదీకి కనీసం నెల రోజుల టైమ్ కూడా గ్యాప్ లేదు. ఎప్పుడు షూట్ చేయాలి, ఎప్పుడూ పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి, ఎప్పుడు సినిమాకు ప్రమోషన్స్ చేయాలి. సో.. ఇలా చూసుకుంటే మరోసారి ఈ సినిమా వాయిదా తప్పదు అనేలా అప్పుడే వార్తలు మొదలయ్యాయి. వార్తలు అని కాదు కానీ, పరిస్థితులు చూస్తుంటే అది నిజమే అని అనిపిస్తుంది. మరోవైపు ఈ సినిమాను ఏదో విధంగా వార్తలలో ఉంచేందుకు మేకర్స్ నానా తంటాలు పడుతున్నారు. తాజాగా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న జ్యోతికృష్ణ రివీల్ చేసిన విషయంతో.. మరోసారి ఈ సినిమా ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
Also Read- Kushboo Sundar: ఇంజక్షన్ల అందం అన్నందుకు.. ఇచ్చిపడేసింది
జ్యోతికృష్ణ ఏం చెప్పారంటే.. ఈ సినిమాలో ఒక యాక్షన్ సీన్‌ను పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేశారట. పవన్ కళ్యాణ్ ఫైట్స్ కంపోజ్ చేస్తారనే విషయం తెలియంది కాదు. గతంలో ఆయన నటించిన సినిమాలలో కొన్నింటికి స్వయంగా పవన్ కళ్యాణే ఫైట్స్ కంపోజ్ చేశారు. చిరంజీవి నటించిన ఓ సినిమాలో కూడా ఆయన ఓ ఫైట్‌ని కంపోజ్ చేశారు. యాక్షన్ పార్ట్ పరంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఇక ‘హరిహర వీరమల్లు’లో 20 నిమిషాల పాటు ఉండే ఒక యాక్షన్ ఎపిసోడ్‌ని పవన్ కళ్యాణ్ రూపొందించారట. దాదాపు ఈ ఫైట్‌లో 1100 మంది పాల్గొన్నారని, ఈ సీన్ సినిమా మొత్తానికి హైలెట్‌గా ఉంటుందని జ్యోతికృష్ణ తెలిపారు. ఆయన ఇచ్చిన ఈ సమాచారంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో బాగానే ఊపొచ్చింది కానీ, ఈ సినిమాకు ఫైట్ కంపోజ్ చేసేంత టైమ్‌ని పవన్ కళ్యాణ్ ఎప్పుడు కేటాయించాడా? అని కూడా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు