Rajinikanth ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Rajinikanth: రజినీకాంత్ ను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్.. బయటపడ్డ బిగ్గెస్ట్ సీక్రెట్?

Rajinikanth: సినీ ఇండస్ట్రీలో అతిలోక సుందరి శ్రీదేవి ప్రస్థానం అసాధారణం. ఈ ముద్దుగుమ్మ చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, తన అద్భుతమైన నటన, ఆకర్షణీయమైన అందంతో తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆమె సౌందర్యానికి సినీ హీరోలు సైతం ఫిదా అయ్యేవారు. అయితే, ఆమె కొడుకుగా నటించిన ఓ సూపర్‌స్టార్ హీరో, శ్రీదేవిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకున్నాడు, కానీ కొన్ని కారణాల వలన పెళ్లి వరకు వెళ్లలేదు. మరి, ఆ స్టార్ హీరో ఎవరో తెలుసుకుందాం..

Also Read: OG Film: పవన్ కళ్యాణ్ ఓజీలో స్పెషల్ సాంగ్ చేయబోతున్న హీరోయిన్ ఎవరంటే? భలే ఆఫర్ పట్టేసిందిగా!

పాన్-ఇండియా నటిగా దాదాపు అందరి స్టార్ హీరోలతో శ్రీదేవి నటించింది. రజినీకాంత్‌తో కలిసి ఏకంగా 17 సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారు. వీరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఫ్యాన్స్‌ని విపరీతంగా కట్టి పడేసింది. 1976లో వీరిద్దరూ మొదటిసారి కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ మూవీ మూండ్రు ముడిచ్చు లో కలిసి నటించారు. ఆ సినిమా చేసేటప్పుడు శ్రీదేవి వయసు 13 సంవత్సరాలు, రజినీకాంత్ కంటే 13 ఏళ్లు చిన్నది. అయితే, ఈ మూవీలో శ్రీదేవి రజినీకాంత్‌కి సవతి తల్లి పాత్రలో కనిపించింది. ఇలా వీరిద్దరూ హీరో-హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించి హిట్స్ అందుకున్నారు.

Also Read: Terrorist Killed: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని ఖతం చేసిన భద్రతా బలగాలు.. ‘హ్యుమన్ జీపీఎస్’గా పిలిచే ఆ టెర్రరిస్ట్ గురించి తెలిస్తే..

వీరిద్దరూ కలిసి వరుస సినిమాలు చేసే కొద్దీ, వారి మధ్య ప్రొఫెషనల్ బంధం వ్యక్తిగత స్నేహంగా మారింది. ఆన్-స్క్రీన్‌లోనే కాక, ఆఫ్-స్క్రీన్‌లోనూ వీరు మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు. రజినీకాంత్‌కి శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో సినీ వర్గాల్లో కొందరికి తెలుసని అంటున్నారు. క్రమంగా శ్రీదేవి, ఆమె కుటుంబంతో రజినీ చాలా సన్నిహితంగా మెలిగాడు. ఇక ఇదే క్రమంలో రజినీ, శ్రీదేవి పట్ల ప్రేమాభిమానాలను మరింత పెంచుకున్నాడు. ఆమెను వివాహం చేసుకోవాలని రజినీ గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని శ్రీదేవి కుటుంబానికి చెప్పి ఒప్పించాలని అనుకున్నాడు.

Also Read: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో భారత్ ఉపయోగించిన ఆయుధాల సంఖ్య ప్రకటించిన ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్

దర్శకుడు కె. బాలచందర్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ” రజినీ కాంత్ ది వన్ సైడ్ లవ్.. శ్రీదేవిని గాఢంగా ప్రేమించాడు. తన ప్రేమను చెప్పడానికి ఆమె ఇంటికి కూడా వెళ్లాడు. కానీ, అతను వాళ్ళ ఇంట్లోకి అడుగుపెట్టగానే అనుకోకుండా కరెంట్ పోయింది, ఇల్లు మొత్తం చీకటి అయిపోయింది. వాటిని బలంగా నమ్మే రజినీ, దీన్ని చెడు శకునంగా భావించాడు. దీంతో, తన మనసులోని మాటను ఇంకో రోజు చెబుదాం అని నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెనుదిరిగాడు. కొన్ని రోజుల తర్వాత వేరే వాళ్ళ నుంచి శ్రీదేవికి తన ప్రేమ గురించి చెప్పడంతో ఆమె రిజెక్ట్ చేసింది ” అని బాలచందర్ వివరించారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం